స్మార్ట్ కళ్ల జోళ్లతో నేరాలకు కళ్లెం.. ఏపీలో వినూత్న ప్రయోగం

ఈ అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో తీవ్రవాదులు, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రెండో దశలో దీన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వినియోగంలోకి తీసుకురానున్నారు.

news18-telugu
Updated: November 22, 2019, 4:01 PM IST
స్మార్ట్ కళ్ల జోళ్లతో నేరాలకు కళ్లెం.. ఏపీలో వినూత్న ప్రయోగం
స్మార్ట్ అద్దాలతో మంత్రి మేకపాటి గౌతమ్
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)

ఏపీలో పెరిగిపోతున్న నేరాల నియంత్రణకు కృత్రిమ మేథ సాయంతో పనిచేసే స్మార్ట్ కళ్లజోళ్లను పోలీసులకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ఎన్ఎన్టీసీ సాఫ్ట్ వేర్ కంపెనీ రూపొందించిన స్మార్ట్ కళ్లజోళ్ల అందుబాటులోకి తీసుకు రానుంది. నిన్న సచివాలయంలో ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో భేటీ అయిన సంస్ధ ప్రతినిధులు ఈ అత్యాథునిక పరిజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆ తర్వాత డీజీపీతో కూడా భేటీ అయి ప్రాజెక్టు వివరాలను అందజేశారు.

దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయడానికి జాతీయ స్ధాయిలో కృత్రిమ మేథ సాయంతో నేరస్తుల ముఖాలను గుర్తించేలా ఓ భారీ డేటా బేస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం జాతీయ నేర గణాంకాల బ్యూరో వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధల నుంచి బిడ్లు కూడా ఆహ్వానించింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన నేరస్తుల డేటాను ఈ డేటా బేస్ లో భద్రపరచడంతో పాటు దాన్ని కృత్రిమ మేథ సాయంతో స్మార్ట్ పరికరాల ద్వారా పోలీసు సిబ్బందికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ టెక్నాలజీ అమలు కోసం జాతీయ స్ధాయిలో ఇప్పటికే ఐబీఎం, హెచ్.పి, యాక్సెంచర్ తో పాటు మరికొన్ని సంస్ధలు పోటీపడుతున్నాయి. అయితే తాజాగా రష్యాకు చెందిన సాఫ్ట్ వేర్ సంస్ధ ఎన్ఎన్టీసీ ఈ ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ బేసెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తామని ముందుకొచ్చింది. నిన్న ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో సచివాలయంలో భేటీ అయిన సంస్ధ ప్రతినిధులు దీని ప్రయోజనాలను వివరించారు. కేవలం స్మార్ట్ కళ్లజోళ్ల సాయంతో పోలీసులు క్షేత్రస్దాయిలో నేరస్తులను అత్యంత సునాయాసంగా ఎలా గుర్తించవచ్చో మంత్రికి వివరించారు. కళ్లజోళ్లతో పాటు వివిధ స్మార్ట్ పరికరాలను కూడా దీనికి అనుసంధానేంచే వీలుందని వారు మంత్రికి తెలిపారు.

పోలీసులు స్మార్ట్ కళ్లజోడు వాడుతూ దానికి ఎడమవైపు ఉంటే చిన్న బటన్ నొక్కడం ద్వారా ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రద్దీ ప్రాంతాల్లో నేరస్తులను గుర్తించి తక్షణం కంట్రోల్ రూమ్ కు సమాచారాన్ని పంపే వీలుంది. తొలి విడతగా రాష్ట్రంలోని ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఈ అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో తీవ్రవాదులు, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రెండో దశలో దీన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత స్మార్ట్ టెక్నాలజీని సెల్ ఫోన్లు, కార్లు, బాడీ కెమెరాలు, డ్రోన్లకు కూడా అనుసంధానించే వీలుంది. దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టిన ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు రావాలని రష్యన్ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులను కోరింది. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకోనుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2019, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading