Grama Volunteers: గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ తీపికబురు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి సేవలు మరో ఏడాది పాటు పొడిగించింది.

news18-telugu
Updated: September 30, 2020, 7:55 PM IST
Grama Volunteers: గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ తీపికబురు
గ్రామ, వార్డు వాలంటీర్లతో వైఎస్ జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి సేవలు మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నవరత్నాలు పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా లబ్ధిదారులకు పథకాలను చేరువ చేసేందుకు డెలివరీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి గ్రామ, వార్డుల్లోనూ 50 నుంచి 100 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించింది. లబ్ధిదారుల కులం, జాతి, మతం, లింగ బేధాలు లేకుండా లబ్ధిదారుల గడప వద్దకే పథకాలను తీసుకుని వెళ్లడం కోసం వీరిని నియమించామని ప్రభుత్వం తెలిపింది. పారదర్శకత, అవినీతిరహితంగా వీరు సేవలు అందిస్తున్నారని పేర్కొంది. 2019 ఆగస్టు 15వ తేదీ నుంచి ఏడాది పాటు వారి సేవలు పొందేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పుడు మరో ఏడాది వారి ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తూ (పనితీరు ఆధారంగా) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అలాగే, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే సంబంధిత అధికారులకు అనుమతులు మంజూరు చేసింది. మొదటి స్పెల్‌లో స్థానం పొందిన గ్రామ్ / వార్డ్ వాలంటీర్లకు పదవీకాలం ఆగస్టు 14 నాటికి ముగిసింది.

సర్కారు ఉత్తర్వుల్లో ముఖ్యమైన అంశాలు


  • ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి సంతృప్తికరంగా పని చేసిన వారిని మాత్రమే మరో ఏడాది పాటు వారి ఉద్యోగ కాలాన్ని పొడిగించాలి.

  • ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుకు సంబంధించి సమగ్రమైన నివేదిక తెప్పించుకున్న తర్వాత వారి పదవీకాలాన్ని పొడిగించే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంటుంది.

  • ఫస్ట్ స్పెల్‌లో జాయిన్ అయిన వారికి వెంటనే వారి పదవీకాలం పొడిగింపుపై వెంటనే ఆదేశాలు ఇవ్వండి. ఆ తర్వాత చేరి వారికి వారి ఏడాది కాలం పూర్తయిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా పొడిగించండి.

  • గ్రామ, వార్డు వాలంటీర్ల పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగించారు కాబట్టి, వారికి ఇచ్చే గౌరవ వేతనం విషయంలో ఏపీసీఎఫ్‌ఎస్ఎస్ సీఈవో తదుపరి చర్యలు తీసుకోవాలి.
  • సీఎఫ్ఎమ్ఎస్ సీఈవో ఆ మేరకు సాంకేతిక సహకారం అందించాలి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 2.6 లక్షల మంది పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. అందుకోసం రాష్ట్ర ఖజానాకు రూ.1560 కోట్ల ఖర్చవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఖాళీల భర్తీకి ఇటీవల పరీక్షల్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబర్ 26న విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC. అయితే సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 26న విడుదల చేసిన కీని వెనక్కి తీసుకుంటున్నామని, మరోసారి కీని విడుదల చేస్తామని, అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇస్తామని ఏపీపీఎస్‌సీ తెలిపింది. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తి కాగానే ఏపీపీఎస్‌సీ కీని http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. కానీ సాంకేతిక కారణాలతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అభ్యర్థులు ఆన్సర్ కీ కోసం http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 30, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading