కడప స్టీల్ ప్లాంట్‌కు కొత్త పేరు పెట్టిన ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది.

news18-telugu
Updated: December 14, 2019, 6:35 PM IST
కడప స్టీల్ ప్లాంట్‌కు కొత్త పేరు పెట్టిన ఏపీ ప్రభుత్వం...
కడప బోర్డు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది. ఇన్నాళ్లూ కడప స్టీల్ ప్లాంట్‌గా పేరుపడింది. దీనికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌గా నామకరణం చేసింది. దీంతోపాటు స్టీల్ ప్లాంట్‌కు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో 3వేల ఎకరాలను స్టీల్ ప్లాంట్‌కు కేటాయిస్తూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రతిపాదనలు పంపారు. సున్నపురాళ్ల పల్లె, పెద్దవండ్లూరు పరిధిలో సుమారు 3148.68 ఎకరాల భూమి కేటాయించాలని కలెక్టర్ హరికిరణ్ ప్రతిపాదించారు. ఎకరం భూమి మార్కెట్ ధర ప్రకారం రూ.1.25లక్షలకు కేటాయించాలని ఆ ప్రతిపాదనల్లో కోరారు. ఈనెల 23 లేదా 24 తేదీల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అయితే, అక్కడ ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ లభించలేదు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 14, 2019, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading