AP GOVT LIKELY TO TAKE KEY DECISION ON SSC 10TH EXAMS SK
పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని గురు, శుక్రవారాల్లో అధికారులు చర్చించారు. దీనిపై ఇవాళ లేదా రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.
కరోనా విజృంభణతో పలు రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఐతే ఏపీ ప్రభుత్వం మాత్రం జులైలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఇప్పటికే తెలిపింది. కానీ ఏపీలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం 400కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం తీరుపై జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డుట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని గురు, శుక్రవారాల్లో అధికారులు చర్చించారు. దీనిపై ఇవాళ లేదా రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.
జులైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏపీ జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. క్రితం 11 పరీక్షల పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు బోర్డ్ కుదించింది. జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్, జులై 11న సెకండ్ లాంగ్వేజ్, జులై 12న థర్డ్ లాంగ్వేజ్, జులై 13న గణితం, జులై 14 సామాన్య శాస్త్రం, జులై 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగుతాయని తెలిపింది. ఐతే కరోనా కేసుల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే రద్దు చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.