ఏపీ అసెంబ్లీ సమావేశాలపై డౌట్?... బడ్జెట్ కోసం కొత్త రూట్..?

కరోనా వైరస్ కారణంగా సమావేశాలను వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

news18-telugu
Updated: June 10, 2020, 3:07 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలపై డౌట్?... బడ్జెట్ కోసం కొత్త రూట్..?
ఏపీ అసెంబ్లీ భవనం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా సమావేశాలను వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. మరో మూడు నెలల కాలానికి కూడా ఆర్డినెన్స్ ద్వారానే బడ్జెట్ పొందేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. అయితే, సమావేశాలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై ఈనెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితి లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ కష్టమనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ పై కూడా ఆర్డినన్స్ తేవచ్చు అనే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది ప్రభుత్వం. జూన్ 16న గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక 18న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్నిరోజులు జరపాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 10, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading