బార్ల పాలసీపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇకపై రాత్రి 10 వరకే..

ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే బార్లలో మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలు మాత్రం రాత్రి 11 వరకు అందుబాటులో ఉంటాయి.

news18-telugu
Updated: November 19, 2019, 5:40 PM IST
బార్ల పాలసీపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇకపై రాత్రి 10 వరకే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటలకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
  • Share this:
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. బార్ల పాలసీపై సీఎం జగన్ ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని సీఎం సూచించగా.. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని, విడతల వారీగా తగ్గిద్దామన్న అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ చర్చ అనంతరం బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బార్ల విధానం అమలులోకి రానుంది. బార్లు మొత్తం తీసేసి కొత్త బార్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఇక బార్లలో మద్యం సరఫరా వేళలను సైతం కుదించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే బార్లలో మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలు మాత్రం రాత్రి 11 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం సరఫరా ఉంటుంది. ఇప్పటికే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. బార్లలో అమ్మే మద్యం ధరలను సైతం పెంచే ఆలోచనలో ఉంది.

మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని...వారిపై నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. లైసెన్స్‌ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని సీఎం అభిప్రాయపడ్డారు.

Published by: Shiva Kumar Addula
First published: November 19, 2019, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading