Home /News /andhra-pradesh /

AP GOVT KEY DECISION ON MOVI TICKET PRICES SB

AP Govt: సినిమా టికెట్లపై జగన్ కీలక నిర్ణయం...ఓటీటీలో చూసేస్తాం కానీ ముందు ఆ పనిచేయాలన్న నెటిజన్

సీఎం జగన్

సీఎం జగన్

ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను ఈ పోర్టల్ ద్వారా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఏపీలో రాజకీయాలు ఇప్పుడు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో ఏపీలోని సినిమా టికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తి పలకనుంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌లో టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు ఏపీఎఫ్‌డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ప్రభుత్వ నిర్ణయంతో ప్రేక్షకులకు ఇకపై తక్కువ ధరకే ఆ​న్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు లభించనున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌ టికెట్‌ లభ్యం కానుంది. యువర్‌ స్క్రీన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే అదనపు ఛార్జీల భారముండదు. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్స్‌కి ఉన్న గత ఒప్పందాలు రద్దు కావు అని ఏపీ ఎఫ్‌డీసీ ఎండీ విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ విధానంతో థియేటర్లకు ఉన్న గత ఒప్పందాలు రద్దు కావని ఏపీఎఫ్‌డీసీ ఎండీ విజయ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

    అయితే సినిమా టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉండాలని కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది. దీని కోసం పలువురు సినీ ప్రముఖులతో సమావేశాలు , చర్చలు నిర్వహించింది. ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను ఈ పోర్టల్ ద్వారా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ల యాజమాన్యాలు అమలు చేయాలని.. అందుకు ఆన్‌లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఎంపీ విజయ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

    అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ఏపీ ప్రజలు స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు.. సినిమా టికెట్ల రేట్లు తగ్గించకపోయినా పర్వాలేదు ... మేం ఓటీటీలో చేసేస్తామంటున్నారు. దీనికన్నా చాలా సమస్యలు ఏపీలో ఉన్నాయిని వాటి విషయం చూడాలన్నారు. రోడ్లు సరిగా లేక ప్రాణాలు పోతున్నాయని.. ముందు రాష్ట్రంలో రోడ్లను సరిచేయాలని కోరుతున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ap cm jagan, AP Politics, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు