బడి బాటలో టీచర్లు.. వారంలో ఆ రెండు రోజులు విధులకు రావాల్సిందే..

అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో సోమ, మంగళవారాల్లో విధులకు హాజరుకావాలని ఆదేశించింది. అటు ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రతి మంగళవారం విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: July 6, 2020, 2:54 PM IST
బడి బాటలో టీచర్లు.. వారంలో ఆ రెండు రోజులు విధులకు రావాల్సిందే..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా లాక్‌డౌన్ వల్ల స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. దాదాపు నెలలుగా విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి కరోనా దెబ్బకు పదో తరగతి పరీక్షలు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా స్కూల్ టీచర్లు సెలవులోనే ఉన్నారు. ఐతే ఇకపై వారంతా బడిబాటపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో సోమ, మంగళవారాల్లో విధులకు హాజరుకావాలని ఆదేశించింది. అటు ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రతి మంగళవారం విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు టీచర్లంతా స్కూళ్లకు వెళ్లాలని ఆదేశించింది. నాడు నేడు కార్యక్రమాన్ని అన్ని స్కూళ్లలో ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading