తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

పేద విద్యార్థుల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: December 13, 2019, 9:06 PM IST
తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఇంగ్లీష్ మీడియంపై దుమారం రేగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషను కాపాడుకుంటూనే విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పిస్తామని చెప్పిన సీఎం జగన్.. ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఏపీ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరి చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుండటంతో తెలుగును తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటికీ తెలుగును సబ్జెట్ తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఇంగ్లీష్ మీడియంపై విపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ జగన్ మాత్రం తాను చేయదలచుకున్నది చేసుకుంటూ వెళ్తున్నారు. సంపన్న కుటుంబాల పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారని.. పేద ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోలేక, ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. పేద విద్యార్థుల భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు.

పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధించబోతున్నారు. తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీషు మీడియంలో భోదన చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>