news18-telugu
Updated: October 26, 2019, 6:45 PM IST
నమూనా చిత్రం
ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య శ్రీ సేవలను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వర్తింపజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల్లో వైద్యసేవలకు ఆస్కారం కల్పించారు. అవయవ మార్పిడి,న్యూరో సర్జరీ,నెఫ్రాలజీ అంశాలతో పాటు మొత్తం 712 చికిత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయించుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్సలకూ ఇకపై ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు రాష్ట్రంలోని ఆస్పత్రులతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో నగరాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు పొందవచ్చు.
అంతేకాదు ఏపీ చరిత్రలోనే తొలిసారిగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది జగన్ సర్కార్. తలసేమియా, సికిల్ సెజ్ డిసీస్, సివియర్ హెమో ఫీలియా వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు పెన్షన్ అందిస్తారు. ఇక బైలేటరల్ ఎలిఫాంటరియాసిస్,క్రానిక్ కిడ్నీ డిసీస్,పక్షవాత రోగులు,ప్రమాద బాధితులకు నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఆపరేషన్ తర్వాత ఆస్పత్రుల్లో ఉండే రోగులకు రోజుకు రూ.225 పోస్ట్ ఆపరేషన్ అలవెన్స్ అందజేయనుంది. జనవరి 1 నుంచి ఈ పింఛన్లను అమలు చేస్తారు.
ఇక ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.16వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఆస్పత్రులు, బోధనా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం. వేతనాల పెంపును వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు చేస్తూ జీవో జారీ చేసింది.
Published by:
Shiva Kumar Addula
First published:
October 26, 2019, 6:45 PM IST