AP GOVT FILES SPECIAL LEAVE PETITION IN SUPREME COURT ON NIMMAGADDA RAMESH ISSUE SK
నిమ్మగడ్డ ఇష్యూపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
నిమ్మగడ్డ, వైఎస్ జగన్
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కింది ఏపీ సర్కార్. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
ఏపీలో ఎన్నికల కమిషనర్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా, ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్ నియమించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. రమేశ్ కుమార్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌లు, జీవోలను కూడా కొట్టివేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్ నియామకం చెల్లదంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కింది ఏపీ సర్కార్. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీలో రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ నియంత పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఐతే వారిపై అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది వైసీపీ. నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పువస్తే.. టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటోందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. తమ ప్రభుత్వం లేకున్నా.. తమ మనుషులు ఉంటే చాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.