టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

టీటీడీ ఈవో అనిల్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 • Share this:
  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన డెప్యుటేషన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సింఘాల్ డిప్యుటేషన్ పొడిగించడం ఇది రెండోసారి. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కింద ఉన్న టీటీడీ బోర్డులోకి ఆయన్ను 2017లో తీసుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈవోగా కొనసాగారు. ఆ పదవీకాలం 2019లో ముగిసిపోయింది. దీంతో మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఆ ఏడాది కాలం కూడా ముగిసిపోవడంతో రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.

  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ 2017లో టీటీడీ 25వ ఈవోగా నియమితులు అయ్యారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఆయన్ను తీసుకొచ్చి ఈవోగా నియమించింది. అప్పట్లో దీనిపై దుమారం రేగింది. నార్త్ ఇండియాకు చెందిన ఐఏఎస్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించడం మీద విమర్శులు వచ్చాయి. కానీ, మూడేళ్ల పాటు ఆయన ఈవోగా కొనసాగారు.

  కొన్నిరోజుల క్రితం టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో 20 మందికి పైగా అర్చకులను రాజ్యాంగవిరుద్ధంగా రిటైర్ చేయించారని ఆరోపించారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. జగన్ కూడా తమను మళ్లీ తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, టీటీడీ ఈవో అనిల్ సింఘాల్, ఏఈవో ఇంకా చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటిస్తూ కోర్టు తీర్పును, జగన్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: