Godavari Boat | గోదావరి బోటులో అసలేం జరిగింది?.. ప్రభుత్వం లేటెస్ట్ రిపోర్ట్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఘటనస్థలంలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శిస్తారు.

news18-telugu
Updated: September 15, 2019, 10:58 PM IST
Godavari Boat | గోదావరి బోటులో అసలేం జరిగింది?.. ప్రభుత్వం లేటెస్ట్ రిపోర్ట్..
గోదావరి బోటు ప్రమాద స్థలం వద్ద సహాయకచర్యలు (File)
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో లాంచీ మునిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. అయితే, ఈ ప్రమాదం గురించి చాలా సందేహాలు ఉన్నాయి. బోటులో ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని రక్షించారు, ఎంతమంది గల్లంతయ్యారు?, అనే అంశాలపై పర్యాటకుల బంధువులతోపాటు ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా దానిపై సమగ్ర వివరాలను అందించింది.

కచ్చులూరు వద్ద బోల్తా పడింది ఓ ప్రైవేట్ బోట్. దానికి అనుమతి లేదని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు.

15వ తేదీ మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కచ్చులూరు వద్ద ఈ బోటు బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 60 మంది ఆ బోటులో ఉన్నారు. వారిలో 27 మందిని రక్షించారు. 8 మృతదేహాలు వెలికి తీశారు. మరో 25 (సుమారు ) మంది గల్లంతయ్యారు.

ఉభయ గోదావరి జిల్లా నుంచి 6 అగ్నిమాపక బృందాలు, 8 ఐఆర్ బోట్లు, 12 ఆస్కా లైట్లు, 1 శాటిలైట్ ఫోన్ సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

నేవీ నుంచి డీప్ డైవర్స్ (లోతులో కూడా వెతికేవారు) బృందం కూడా ఘటన స్థలానికి చేరుకుంది.1 ఓఎన్జీసీ హెలికాప్టర్ సాయంతో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు.

ప్రాణాలతో బయటపడిన 27 మందిలో 16 మందికి రంపచోడవరంలోని ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 11 మందికి రంపచోడవరంలోనే చికిత్స అందిస్తున్నారు.

బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారు ఉండడానికి లాస్పిన్ అనే హోటల్లో వసతి ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు వెలికి తీసిన ఎనిమిది మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఘటనస్థలంలో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శిస్తారు.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading