పరీక్షలు వాయిదా వేసినందుకు థాంక్స్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

APPSC Exams Postponed: కరోనా కారణంగా డిపార్ట్‌మెంటల్ పరీక్షలు వాయిదా వేయడంపై ఉద్యోగ సంఘాలు ఏపీపీఎస్సీకి కృతజ్ఞతలు తెలిపాయి.

news18-telugu
Updated: August 23, 2020, 8:16 PM IST
పరీక్షలు వాయిదా వేసినందుకు థాంక్స్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు
APPSC Logo
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో డిపార్ట్‌మెంటల్ పరీక్షలను వాయిదావేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీపీఎస్సీకి ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థతులలో డిపార్టుమెంటు పరీక్షలకు హాజరు కావడంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులను గమనించి పరీక్షలను వాయిదా వేసిన ఏపీపీఎస్సీ కి ఉద్యోగుల తరపున, ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఈ సారి డిపార్టుమెంటు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే. వీరు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో బిజీగా ఉండటంతో పాటు కొందరికి ఆగస్టు 25 నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా డిపార్టుమెంటు పరీక్షలలో నెగెటివ్ మార్కుల విధానాన్ని తొలగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కావున డిపార్టుమెంటు పరీక్షలను వాయిదా వేసి త్వరగా నెగెటివ్ మార్కుల విధానాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఉద్యోగుల విజ్ఞప్తిని మన్నించి పరీక్షలను వాయిదా వేసినందుకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, APPSC కార్యదర్శి సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, కె. ధనుంజయ రెడ్డికి కతజ్ఞతలు తెలియజేస్తున్నాం.’ అంటూ ఏపీ గవర్న‌మెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నింబధనలకు అనుగుణంగా నిర్వహణ కోసం సమయత్తమైనా.. కరోనా వ్యాప్తిని, కొత్త కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం మార్చుకుంది. పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షలకు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇందులో లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నట్లు తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 23, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading