హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సర్పంచ్‌లకు భారీ షాకిచ్చిన జగన్ సర్కార్ -పంచాయితీల ఖాతాల్లో డబ్బు ఊడ్చేశారు -వెల్లువలా రాజీనామాలు

సర్పంచ్‌లకు భారీ షాకిచ్చిన జగన్ సర్కార్ -పంచాయితీల ఖాతాల్లో డబ్బు ఊడ్చేశారు -వెల్లువలా రాజీనామాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల గ్రామ పంచాయతీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయకపోగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను లాగేసుకోవడంపై సర్పంచ్ లు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)శ్ లో 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహారం రచ్చకు దారితీసింది. సీఎం జగన్ (CM Jagan) సొంత జిల్లా కడపతోటు దాదాపు అన్ని జిల్లాల్లో పలువురు సర్పంచ్ లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. చట్ట ప్రకారం పంచాయితీలకు దక్కాల్సిన నిధుల్ని ప్రభుత్వం చెప్పా పెట్టకుండా ఖాతాల నుంచి మాయం చేసిన తీరుపై సర్పంచ్ లు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ అకౌంట్‌లలోని నగదును వారి అనుమతి, తీర్మానం లేకుండా ప్రభుత్వం ఒక్కసారిగా లాగేసింది. దీంతో రాష్ట్రంలోని సర్పంచ్‌లు, కార్యదర్శులు ఒక్క సారిగా షాక్ గురైయ్యారు.

పంచాయితీ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్

ఇటీవల గ్రామ పంచాయతీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయకపోగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను లాగేసుకోవడంపై సర్పంచ్ లు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఆర్ధిక సంఘం నిధులతో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పథకాల మరమ్మత్తులు, కార్మికుల జీతాలు, పంచాయతీల అభివృద్ధికి 60 శాతం నిధులు ఖర్చు చేస్తుంటారు. శనివారం సీఎఫ్ఎంఎస్ ఖాతాలతో లింక్ అయిన సర్పంచ్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపడంతో వారు ఒక్క సారిగా షాక్ గురైయ్యారు.

World Bank : జగన్ సర్కారుకు ప్రపంచ బ్యాంక్ కొత్త అప్పు -కేంద్రం ఆమోదంతో 1800కోట్లు -దేనికంటేఆందోళన బాటలో సర్పంచ్‌లు

గతంలో పలు పంచాయతీలు విద్యుత్ చార్జీల బకాయిలు ఉండటంతో నాడు అనుమతితో 14వ ఆర్ధిక సంఘం నిధుల నుండి మినహాయించి చెల్లించారు. అప్పుడు గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్‌లు ఉండటంతో ప్రభుత్వ నిర్ణయానికి వారు అభ్యంతరం చెప్పలేదు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి నూతన సర్పంచ్ లకు ‌చెక్ పవర్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా పంచాయతీ తీర్మానం, ఆమోదం లేకుండా ప్రభుత్వం ఉన్న పళంగా లక్షలాది రూపాయలను తీసేసుకోవడంపై సర్పంచ్ లు ఆందోళన చెందుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలో పనులు ఎలా జరుగుతాయని మధనపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు వ్యతిరేకిస్తున్నారు. పలు జిల్లాల్లో సర్పంచ్ లు రాజీనామాలు, భిక్షాటనలతో ప్రభుత్వంపై నిరసనలు తెలుపుతున్నారు.

ఏపీలో 3కాదు, 2రాజధానులు -సమ్మర్, వింటర్ క్యాపిటల్స్ -సీఎం జగన్‌కు బీజేపీ బంపర్ ఆఫర్ఏకగ్రీవ ప్రోత్సాహకాలేవి?

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహాకాలు ప్రకటించిన దరిమిలా గ్రామాల్లో అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి గ్రామ పెద్దలు కూర్చుని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. 2వేల జనాభాలోపు గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు, 5వేల జనాభా ఉండే పంచాయతీలకు ఏకగ్రీవం అయిన పక్షంలో పది లక్షలు, 5001 నుండి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు, పది కన్నా అధికంగా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు నగదు ప్రోత్సాహాకాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ నిధులను విడుదల చేయకపోగా పంచాయతీ అకౌంట్ లోని 15వ ఆర్ధిక సంఘం నిధులు ఖాళీ చేయడంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో పలువురు గ్రామ పంచాయతీ సర్పంచ్ లు కోర్టును ఆశ్రయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.

Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు