Home /News /andhra-pradesh /

AP GOVT ASKS ALL COLLEGES TO GO ENGLISH MEDIUM IN CONTRAST TO CENTER EDUCATION POLICY EVK

Andhra Pradesh: నూతన విద్యావిధానానికి భిన్నంగా కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English Medium) ప్రవేశపెడుతోంది. విద్యార్థుల కెరీర్ అవకాశాలను మెరుగుపరచడానికి ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు ప్ర‌భుత్వం (Government) పేర్కొంది. కేంద్ర నూతన విద్యా విధానం ఇందుకు భిన్నంగా ఉంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతోంది. విద్యార్థుల కెరీర్ (Career) అవకాశాలను మెరుగుపరచడానికి ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ సంవ‌త్సరం సంవత్సరం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2.62 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నారు, అందులో 65,989 మంది విద్యార్థులు మాత్రమే తెలుగు మీడియంలో ప్రవేశం పొందారు. అంటే 75 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకముందే ఇంగ్లీష్ మీడియం (Medium) ఎంచుకున్నారు.  అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆంగ్ల భాష మరియు వ్రాత నైపుణ్యాలను పెంచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

    కేంద్ర విధానానికి భిన్నంగా..
    ప్ర‌స్తుతం కేంద్రం ప్రాతీయ‌భాష‌ల ప్రోత్సాహాన్ని భిన్నంగా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్రం నూత‌న విద్యావిధ‌నం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించేదిలా ఉంది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. భాష కార‌ణంగా ఉన్న‌త విద్య‌లో విద్యార్థిపై వివ‌క్ష చూప‌రాద‌ని NEP 2020 ప్ర‌కారం సూచించింది. నూత‌న విద్యా విధానం ప్ర‌కారం ద్విభాష విధానాన్ని ప్రోత్స‌హిస్తోంది.

    Andhra pradesh Jobs: ఏపీఎస్ఎఫ్‌సీలో మేనేజ‌ర్ ఉద్యోగాలు.. అర్హ‌తలు ఇవే


    నూత‌న విద్యావిధానం ప్ర‌కారం ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం మరియు తెలుగుతో సహా ఐదు ప్రాంతీయ భాషలలో అందించబడుతున్నాయి. AICTE ఈ సంవత్సరం ప్రారంభంలో మొత్తం 83,195 అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ఒక సర్వే నిర్వహించింది, అందులో 43.79 శాతం మంది విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో చదువుకోవాలని అన్నారు. సర్వే ప్రకారం, 12,487 మంది విద్యార్థులు హిందీలో 7,818, మరియు తెలుగులో 3,991 మంది నేర్చుకోవాలనుకున్నారు.

    కేవలం ఉన్న‌త విద్యాలో మాత్ర‌మే కాదు. నూత‌న విద్యా విధానం ప్ర‌కారం బోధ‌న వీలైనంత‌గా ప్రాంతీయ భాష‌లో బోధ‌న పెంచేలా రూపొందించారు. కొత్త విద్యావిధానం ప్ర‌కారం స్థానిక భాష‌, మాతృభాష‌లో గ్రేడ్ 5 నుంచి గ్రేడ్‌8 వ‌ర‌కు బోధ‌న జ‌రిగేలా చూడాల‌ని సూచించింది. ఉన్న‌త విద్య‌లోనూ స్థానిక భాష లేదా మాతృ భాష‌లో బోధ‌న జ‌రిగేలా నూత‌న విద్యావిధానం పేర్కొంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకొన్న ఈ నిర్ణ‌యం నూత‌న విద్యావిధానికి భిన్నంగా ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra pradesh news, EDUCATION, English medium

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు