హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking news: సినీ పరిశ్రమకు జగన్ సర్కార్ షాక్.. కీలక ఆదేశాలు జారీ..!

Breaking news: సినీ పరిశ్రమకు జగన్ సర్కార్ షాక్.. కీలక ఆదేశాలు జారీ..!

అప్పట్లో అవి బాగా వైరల్ అయ్యాయి కూడా. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల సమస్య విషయమై మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇప్పుడు ఈ మాటలనే టాలీవుడ్‌ ప్రముఖులు నిజం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమ బాధలు అర్థం చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలను సవరిస్తూ కొత్త జీవో తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి తమ వంతుగా సన్మానం చేయాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారని తెలుస్తుంది.

అప్పట్లో అవి బాగా వైరల్ అయ్యాయి కూడా. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల సమస్య విషయమై మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇప్పుడు ఈ మాటలనే టాలీవుడ్‌ ప్రముఖులు నిజం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమ బాధలు అర్థం చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలను సవరిస్తూ కొత్త జీవో తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి తమ వంతుగా సన్మానం చేయాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారని తెలుస్తుంది.

Breaking news: సీనీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం జగన్ ను స్వయంగా కలిసి చిరంజీవి విన్నపాలు చేసినా ఫలితం దక్కలేదు.. ఇకపై ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది.. మరి రేపటి నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందా..?

ఇంకా చదవండి ...

  Breaking news: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు షాకే అని చెప్పాలి. సినీ పెద్దల డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై గతంలో పెను దుమారం రేగింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ను అడ్డుకోడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆందోళన చెందారు. పార్టీలకు అంతీతంగా మాజీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అటు చిరంజీవి అధ్యక్షతను సీనీ పెద్దలు సీఎం జగన్ కు కలిసి.. రేట్ల విషయంలో వెసులు బాటు ఇవ్వాలని కోరినట్టు కూడా ప్రచారం ఉంది. అయితే తరువాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు వకీల్ సాబ్ సినిమా హిట్ అయినా.. ప్రభుత్వం నిర్ణయం కారణంగానే నష్టాలు వచ్చేయనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వలు మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసే అవకాశం ఉంది..

  అయితే సినీ పరిశ్రమకు షాక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం అభిమానులకు మాత్రం శుభవార్తే చెప్పింది. రేపటి నుంచి ఏపీలో థియేటర్లు తెరుచుకోనున్నాయి. 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతులు మంజూరు చేసింది. అయితే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వంద శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతి ఇచ్చినా.. ఇప్పటికీ ఒక్క కొత్త సినిమా విడుదల కాలేదు. అలాగే ప్రేక్షకుల తాకిడి కూడా అంతగా కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ సందడి మళ్లీ షూరు అయ్యేలాగే కనిపిస్తుంది.

  ఇదీ చదవండి: ఇక జనంలోకి జగన్.. త్వరలో జిల్లా స్థాయి పర్యటనలు.. కారణం ఇదే

  ఏపీలో థియేటర్లు మూత పడి.. తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకుగా.. అన్ని చిన్న సినిమాలే విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఇక క్రమంగా కరోనా భయాన్ని పక్కన పెట్టి.. థియేటర్లకు ఆడియోన్స్ తాకిడి పెరుగుతున్న సమయంలో కరోనా మరోసారి పంజా విసిరింది. థియేటర్లు ఓపెన్ అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో విజృంభించింది. దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించకంటే ముందే థియేటర్లు మూతపడిపోయాయి. ప్రస్తుతం కోవీడ్ కేసులు తగ్గుతుండడంతో.. ప్రభుత్వాలు పలు సంస్థలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇలా థియేటర్లు ఓపెన్ చేస్తుండడం సినీ అభిమానులకు గుడ్ న్యూస్ అయినా.. రేట్లను ప్రభుత్వం నిర్దేశించే ధరకే విక్రయించాలన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీకి షాక్ లాంటిందే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరి రేపటి నుంచి థియేటర్లు తెరుచుకుంటాయా..? ప్రభుత్వం నిర్ణయాన్ని సినిమా సంఘాలు ఒప్పుకుంటాయా..? ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి..

  ఇదీ చదవండి: బాలయ్యను టెన్షన్ పెడుతున్న ఇద్దరు అల్లుళ్లు.. దాని కోసం ఇద్దరూ పోటీ..?

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Theatres, Tollywood

  ఉత్తమ కథలు