ఏపీలో స్కూళ్లకు అప్పటి వరకు సెలవులే... ఆర్డర్స్ జారీ...

ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు జూన్ 11 వరకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

news18-telugu
Updated: May 1, 2020, 10:52 PM IST
ఏపీలో స్కూళ్లకు అప్పటి వరకు సెలవులే... ఆర్డర్స్ జారీ...
తెలంగాణలో అప్పుడే పాఠశాలలు తెరవొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు జూన్ 11 వరకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. అయితే, స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై ప్రభుత్వం తరఫున మరోసారి అధికారికంగా తెలియజేస్తామని ప్రకటించింది. స్కూళ్లు ఎప్పుడు తెరిచేదీ కరోనా వైరస్ మీద ఆధారపడి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తర్వాత మరోసారి దీనిపై క్లారిటీ ఇస్తామని ప్రకటించింది.

ఏపీలో స్కూల్ ఫీజుల గురించి ఇటీవల రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ఆర్.కాంతారావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలి (విద్యా సంవత్సరం ఆరంభంలో). అది కూడా ఒకేసారి అడగకూడదు. రెండు విడుతల్లో తీసుకోవాలి. మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులో సగం చెల్లించిన 45 రోజుల తర్వాత రెండో సగం అడగాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి. ఇతరత్రా ఎలాంటి రకాల ఫీజులు వసూలు చేయకూడదు. గత సంవత్సరంలో ఎంత ఫీజులు వసూలు చేశారో, ఈ విద్యాసంవత్సరంలో కూడా అంతే ఫీజులు వసూలు చేయాలి. ఫీజులు ఏమాత్రం పెంచకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజులను ఫిక్స్ చేస్తుంది. అలా ఫిక్స్ చేసిన తర్వాత విద్యార్థులు చెల్లించిన ఫీజును కట్ చేసి, మిగిలిన దాన్ని మాత్రమే వసూలు చేయాలి.
First published: May 1, 2020, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading