Home /News /andhra-pradesh /

AP GOVT ADVISOR AJEYA KALLAM RESPONSE TO NIRMALA SITHARAMAN ON HIGH POWER TARIFFS IN ANDHRA BA

విద్యుత్ టారిఫ్‌పై నిర్మలా సీతారామన్‌కు ఏపీ ప్రభుత్వం కౌంటర్...

అజయ్ కల్లాం(ఫైల్ ఫోటో)

అజయ్ కల్లాం(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ టారిఫ్‌కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం కౌంటర్ ఇచ్చారు.

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ టారిఫ్‌కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం కౌంటర్ ఇచ్చారు. ఏపీలో విద్యుత్ యూనిట్ రూ.9 అయితే ఎలా భరిస్తారని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అజేయ కల్లం ఏపీలో ఇండస్ట్రియల్ విద్యుత్ టారిఫ్ రూ.7.65 అని స్పష్టం చేశారు. 2017లో చంద్రబాబునాయుడు హయాంలో ఫిక్స్ చేసిన ధరనే వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని చెప్పారు. నిర్మలా సీతారామన్ చెబుతున్న రూ.9 ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదన్నారు. కేంద్రం రూ.2.75కే విద్యుత్ ఇస్తుందని చెప్పిన వ్యాఖ్యలకు కూడా అజేయకల్లం బదులిచ్చారు. ఆమె చెప్పిన రూ. 2.75కి విద్యుత్‌ను ఎక్కడ ఇస్తున్నారో కేంద్రం చెప్పాలని అజేయ కల్లం డిమాండ్ చేశారు. వర్చువల్ ర్యాలీలో నిర్మలా సీతారామన్ చేసిన పలు వ్యాఖ్యలకు అజేయ కల్లం కౌంటర్ ఇచ్చారు. విద్యుత్‌పై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి అవసరం లేదని చెబుతున్నా కేంద్రం తమకు విద్యుత్ అంటగడుతోందని మెగా వాట్ యూనిట్ ట్రాన్స్‌మిట్ చేసినందుకు రూ.5.5 లక్షలు వసూలు చేస్తోందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.2500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. ఏపీకి మైన్స్ కేటాయించాలని ఎన్ని సార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని అజేయ కల్లం ఆరోపించారు. దీని వల్ల రాష్ట్రం ప్రతి ఏడాది నష్టపోతోందని పేర్కొన్నారు. ఏపీలో పవర్ సెక్టార్‌పై నిర్మలా సీతారమన్‌కు సరైన సమాచారం లేదన్నారు. విద్యుత్ అప్పు రూ.70వేల కోట్లు ఉందని అజేయ కల్లం చెప్పారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదన్నారు. కేంద్రం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. కృష్ణపట్నం డిజైనింగ్ వైఎస్ఆర్ హయాంలోనే చేసినా.. తర్వాత మార్పులు జరిగాయని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల అప్పుల పాపం తమది కాదని అజేయ కల్లం అన్నారు.
    First published:

    Tags: Andhra Pradesh, Nirmala sitharaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు