ఏపీ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్… జగన్‌ సర్కార్‌కు మరో ఛాన్స్

ఏపీలో శాసనసభ, శాసనమండలి ప్రొరోగ్ కావడం వైసీపీ సర్కార్‌కు కలిసొచ్చే అంశమనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: February 13, 2020, 5:47 PM IST
ఏపీ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్… జగన్‌ సర్కార్‌కు మరో ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ మ్యాప్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాష్ట్రంలోని శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్తుర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్ ఈరకంగా సభలను ప్రొరోగ్ చేయడం సాధారణ ప్రక్రియే అయినా... ఈసారి మాత్రం ఇలా చేయడం అధికార పార్టీకి ఒకరకంగా మేలు చేసిందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఉభయసభల ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి ఈ మేరకు వెసులుబాటు లభించిందని తెలుస్తోంది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్‌లోనూ అనేకసార్లు ఈరకంగా ఆర్డెనెన్స్‌లు తీసుకొచ్చారని సచివాలయ వర్గాలు అంటున్నాయి.
First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు