Home /News /andhra-pradesh /

AP GOVERNOR BISWABHUSHAN HARICHANDAN MAY TAKE DECISION ON THREE CAPITALS BILL TODAY AK

ఇటు అమరావతి, అటు విశాఖ.. నేడు గవర్నర్ కీలక నిర్ణయం ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజధాని బిల్లులపై గవర్నర్ నేడు నిర్ణయం తీసుకుంటారా ? తీసుకుంటే ఆయన నిర్ణయం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా లేక వ్యతిరేకంగా ఉంటుందా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

    పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులపై నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా ? అమరావతి భవిష్యత్తు ఏమిటనే అంశం నేడు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఉందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్దకు చేరుకోవడం... ఆయన వీటిపై న్యాయసలహా కూడా కోరారనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. న్యాయ సలహా కూడా ప్రభుత్వ న్యాయ విభాగం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇకపై గవర్నర్ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

    అయితే ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది ? గవర్నరే నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు గవర్నర్‌కు లేఖ రాశారు. ఇది కేంద్ర పరిధిలోని అంశమని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాష్ట్రపతికి నివేదించాలని కోరారు.

    ap local bodap three capitals bill, crda bill, ap assembly bills, governor biswabhushan, governor harichandan, biswabhushan news, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు, గవర్నర్ హరిచందన్, ఏపీ కేపిటల్ y elections,ap local elections,ap local body elections reservations,ap local body elections latest news,ap local body election date,ap local body election 2020 date,ఏపీలో పంచాయతీ ఎన్నికల డేట్,ఏపీలో ఎంపీటీసీ ఎన్నికల డేట్,ఏపీలో జెడ్పీటీసీ ఎన్నికల డేట్,ఏపీలో మున్సిపల్ ఎన్నికల డేట్,ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు,
    ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (File)


    ఈ నేపథ్యంలో నేడు గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారా ? తీసుకుంటే ఆయన నిర్ణయం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా లేక వ్యతిరేకంగా ఉంటుందా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇప్పటికే నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను పాటించాలని గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి గవర్నర్ సూచనలు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో రాజధాని బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయం ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, Biswa Bhushan Harichand, Visakhapatnam

    తదుపరి వార్తలు