‘మంగళగిరి’పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం మంగళగిరిపై కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 11, 2019, 5:56 PM IST
‘మంగళగిరి’పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఏపీ రాజకీయాల్లో మంగళగిరి ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. టీడీపీ యువనేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోటీ చేసి ఓడిపోయిన ఈ స్థానంపై తమ పట్టును మరింతగా పెంచుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న టీడీపీ... వచ్చే ఎన్నికల్లో అయినా తమ ఈ సీటును గెలుచుకుని వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇంత కీలకమైన మంగళగిరిపై ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మున్సిపాలిటీ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మంగళగిరి పరిధి ఫస్ట్ గ్రేడ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళగిరిలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని... రాజధానికి సంబంధించి శాశ్వత భవనాలను మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తోందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో మంగళగిరి మున్సిపాలిటీకి ప్రమోషన్ లభించడంతో... ఏపీ రాజధాని ప్రాంతం మంగళగిరికి రానుందా ? అనే వాదనకు మరింత బలం చేకూరింది.
Published by: Kishore Akkaladevi
First published: December 11, 2019, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading