శ్రీశైలం ఆలయ ఈవోపై బదిలీ వేటు...షాపుల వివాదానికి ఫుల్‌స్టాప్

ఆలయ కొత్త ఈవోగా K.S.రామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రామారావు ఏడాదిపాటు ఈవోగా కొనసాగనున్నారు.

news18-telugu
Updated: August 19, 2019, 9:47 PM IST
శ్రీశైలం ఆలయ ఈవోపై బదిలీ వేటు...షాపుల వివాదానికి ఫుల్‌స్టాప్
శ్రీశైలం
  • Share this:
శ్రీశైలంలో దుకాణాల వేలం వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. షాపుల వేలాన్ని ఏపీ సర్కార్ రద్దుచేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం ఈవో శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీచేసింది. ఈవో శ్రీరామచంద్ర మూర్తి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆలయ కొత్త ఈవోగా K.S.రామారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రామారావు ఏడాదిపాటు ఈవోగా కొనసాగనున్నారు.

దుకాణాల వేలం రద్దుపై దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేసిన మంత్రి వెల్లంపల్లి.. పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి లేని పారదర్శక పరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. దేవాలయాలలో రాజకీయాలకు తావులేదన్నారు. శ్రీశైల దేవస్థానం పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టంచేశారు.

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఆలయాలను వేలంలో ముస్లింలకు కేటాయించారని బీజేసీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీశైలంలో అన్యమతస్తుల ఆధిపత్యం పెరిగిపోయిందని..హిందువుల మనోభవాలను ఆలయ అధికారులు దెబ్బతీస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆలయ ఈవో తీరును నిరసిస్తూ మంగళవారం ఛలో శ్రీశైలం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో దుకాణాల వేలాన్ని రద్దుచేసి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టిన ప్రభుత్వం.. ఆలయం ఈవోపై బదిలీ వేటు వేసింది.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు