Home /News /andhra-pradesh /

AP GOVERNMENT TO SUPPLY NATURAL PRODUCTS TO FAMOUS TEMPLES IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP Temples: ఇంద్రకీలాద్రి, సింహాచలం, శ్రీశైలం సహా ఈ ఆలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటితోనే ప్రసాదాలు..

సింహాచల దేవస్థానం (File)

సింహాచల దేవస్థానం (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖ ఆలయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam), ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం, అన్నవరం, కాణిపాకం, సింహాచలం, ద్వారకా తిరుమల వంటి ఆలయాలకు నిత్యం భక్తులు పోటెత్తుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖ ఆలయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam), ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం (Vijayawada KanakaDurga Temple), శ్రీశైలం (Srisailam Temple) , అన్నవరం, కాణిపాకం, సింహాచలం, ద్వారకా తిరుమల వంటి ఆలయాలకు నిత్యం భక్తులు పోటెత్తుతారు. అలాగే మరికొన్ని ఆలయాలకు కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆయా ఆలయాల్లో భక్తులకు ఆలయాల ఆధ్వర్యంలో ప్రసాదంతో పాటు అన్నప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. ఐతే ఆలయాల్లో పంపిణీ చేసే ప్రసాదాలు, అన్నప్రసాదాలపై అందరి దృష్టి ఉంటుంది. ప్రసాదాలు, అన్నదాన సత్రాల్లో వంటకు వినియోగించే సరుకుల నాణ్యతపై చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే దేవుడి ప్రసాదాలు అత్యంత శ్రేష్టంగా, పవిత్రంగా ఉండాలనే డిమాండ్లు కూడా భక్తుల నుంచి వినపడుతుంటాయి.

    ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ మేరకు రైతు సాధికార సంస్థ గతేడాది టీటీడీతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ప్రకృతిసిద్ధంగా పండించిన శనగలను సరఫరా చేస్తోంది. వీటిని ఏపీ మార్క్ ఫెడ్ సరఫరా అందిస్తోంది. ఈ శనగలను కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చివారి నుంచే సేకరిస్తున్నారు.

    ఇది చదవండి: ఒకప్పుడు కిలో రూ.160.. ఇప్పుడు రూ.8.. ఇంతలో ఎంత తేడా..!


    ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శెనగలకు కనీస మద్దతు ధరకంటే 10శాతం అదనంగా చెల్లించి సేకరిస్తున్నారు. వీటిని థర్డ్ పార్టీ ద్వారా పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాతే టీటీడీకి అందిస్తున్నారు. ఇదే పద్ధతిలో దత 10 నెలల్లో రూ.7.52 కోట్ల విలువైన 1306 టన్నుల శనగలను టీటీడీకి సరఫరా చేశారు. ఇదిలా ఉంటే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తిరుమలలో శ్రీవారి నైవేద్యం, ప్రసాదాలలే కాకుండా నిత్యాన్నదనం కోసం 24,728 టన్నుల మేర 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.



    టీటీడీ మాదిరిగానే రాష్ట్రంలోని మరో ఎనిమిది ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, శ్రీశైలం మల్ల అలయం, ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం, సింహాచలం, పెనుగంచిప్రోలుతో పాటు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాలకు సహజ సిద్ధంగా పండించిన ఉత్పత్తులను అందించేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఆలయాలకు సరఫరా చేసే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్ఫిఫేకషన్ చేయించిన తర్వాతే అందిస్తారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Hindu Temples

    తదుపరి వార్తలు