ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని(Jagananna Sampoorna Gruha Hakku Scheme) అమలు చేస్తోంది. ఈ పథకం కింద 1983-2011 మధ్య ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నవారికి సంపూర్ణ ఆస్తి హక్కును కల్పిస్తోంది. ఈ పధకం కింద రాష్ట్రంలో మొత్తం 51లక్షల 8వేల మంది లబ్ధిదారులు ఉండగా వారిలో 39.7లక్షల మంది ఋణం గ్రహీతలు,12.1లక్షల మంది ఇతరులు (నాన్ లోనీ ఉన్నారు. 10 సంవత్సరాలకు ముందు రుణము లేదా పట్టా పొంది, ఋణ గ్రహీత లేక పట్టాదారు లేక వారి వారసులు అనుభవంలో ఉన్నవారికి ఈ పధకం వర్తిస్తుంది. ఈ పథకం కింద నామమాత్ర రుసుము చెల్లించి లబ్ధిదారుడు తన ఇంటిపై సర్వ హక్కులు పొందవచ్చు.
ప్రయోజనాలివే..!
ఈ పథకం కింద లబ్ధిదారుడు తన రిజిస్ట్రేషన్ పత్రంతో బ్యాంకులు నుండి ఋణం పొందేందుకు, తనఖా పెట్టుకునేందుకు, అమ్ముకునేందుకు, లేదా బహుమతిగా ఇచ్చేందుకు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్ చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ కు ఎలాంటి డ్యూటీ ఫీజును చెల్లించనవసరం లేదు.భూమి విలువపై 7.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ ఉంటుంది. విలువపై నూరు శాతం యూజర్ ఫీజు మాఫీ ఉంటుంది. ఈపధకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయాలకు ఏవిధమైన లింక్ డాక్యుమెంట్ అవసరం లేదు.
గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్
లబ్దిదారునికి చెందిన స్థిరాస్తిని గ్రామ సచివాలయంలో రిజిష్టర్ చేసుకోసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. రిజిష్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుడి స్థిరాస్తిని 22(ఎ)నిబంధన నుండి తొలగిస్తారు. అలాగే లబ్ధిదారుడు ఏవిధమైన లావాదేవీలైనా చేసుకునే అవకాశముంది. రిజిష్ట్రషన్ రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నామ మాత్రపు రుసుముతో గ్రామ సచివాలయంలో రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చు.
నామమాత్రపు రుసుములు
లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10వేలు,మున్సిపాలిటీల్లో రూ.15వేలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.20వేల చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వడ్డీ మరియు అసలు పై తెలిపిన రుసుము కంటే తక్కువ ఉన్నచో తక్కువ రుసుము చెల్లిస్తే సరిపోతుంది.
ప్రస్తుత జనగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం ద్వారా ఋణం చెల్లించిన రశీదు చూపించిన వెంటనే స్థిరాస్థికి సంబంధించిన పట్టా మంజూరు చేస్తారు. ఈపధకానికి సంబంధించిన మొత్తం పనులన్నీ గ్రామ సచివాలయాల్లోనే జరుగుతాయి. లబ్దిదారుల గుర్తింపు, స్థిరాస్థికి చెందిన కొలతలు, రుసుం చెల్లింపు, ఋణం చెల్లింపు వంటి పనులన్నింటి కోసం మండల కార్యాలలకు తిరగాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయంలో సంబంధిత సహాయకులకు కలిస్తే సరిపోతుందని ప్రభుత్వం వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government