హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Volunteers: వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం.. రూ.250 కోట్లతో అవార్డులు

AP Volunteers: వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం.. రూ.250 కోట్లతో అవార్డులు

వరసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల (Village Volunteers) కు అవార్డులు ప్రదానం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సిద్ధమైంది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేయనుంది.

ఇంకా చదవండి ...

  వరసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల (Village Volunteers) కు అవార్డులు ప్రదానం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సిద్ధమైంది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేయనుంది. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తున్న వాలంటీర్లకు సీఎం జగన్ అందిస్తున్న చిరుసత్కారం ఇదని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మందికి రూ.258.74 కోట్ల నగదు పురస్కారాలు అందచేస్తున్నట్లు ప్రకటించింది. గత సంవత్సరం అందించిన రూ.226.7 కోట్లతో కలిపి రెండేళ్ళలో మొత్తం రూ.485.44 కోట్ల నగదు పురస్కారాలు అందిస్తున్నట్లు పేర్కొంది.

  ఏప్రిల్‌ 7 వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగుతుందని.., కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపిక చేశారు.

  ఇది చదవండి: పుష్ప నుంచి ఆర్ఆర్ఆర్ వరకు.. ఏపీలో బెస్ట్ షూటింగ్ స్పాట్ ఇదే..

  సేవా వజ్ర

  సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డుల ప్రదానం

  ఇది చదవండి: ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఇదే..!

  సేవా రత్న

  సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున మొత్తంగా 4,136 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డుల ప్రదానం

  ఇది చదవండి: మీ పాదం చదునుగా ఉంటే.. ఆ ఉద్యోగానికి అనర్హులే.. హైకోర్టు కీలక తీర్పు..

  సేవా మిత్ర

  సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా 2,28,322 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డుల ప్రదానం

  ఇది చదవండి: ఏపీలో పెరిగిన భూముల ధరలు.. కొత్త జిల్లాల తర్వాత సర్కార్ నిర్ణయం

  ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్‌లతో పాటు రేషన్‌ డోర్‌ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్ధిష్ట కాలపరిమితితో అందిస్తున్నట్లు పేర్కొంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Gram volunteer

  ఉత్తమ కథలు