Home /News /andhra-pradesh /

AP GOVERNMENT TO INAUGURATE YSR EBC NESTHAM SCHEME AS CM YS JAGAN TO CREDIT FINANCIAL ASSISTANT FULL DETAILS HERE PRN

YSR EBC Nestham: మరో కొత్తపథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. వారి ఖాతాల్లో రూ.15వేలు

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో కొత్త పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనుంది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో కొత్త పథకానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi), వైఎస్సార్ పెన్షన్ కానుక (YSR Pension Kanuka), వైఎస్సార్ ఆసరా (YSR Asara), వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత (YSR Cheyutha), వైఎస్సార్ కాపు నేస్తం (YSR Kapu Nestham), ఉచిత ఇళ్ళ పట్టాల వంటి పథకాలను మహిళల పేరుతో అందించిన ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం మొదటి విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు 3,92,674 మంది పేద అక్క చెల్లెమ్మలకు రూ. 589 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

    వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తోపాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ళపాటు అందిస్తూ వారికి జీవనోపాధికి సహకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం చేస్తున్నట్లు వివరించింది.

    ఇది చదవండి: బుద్ధా కామెంట్స్ తో విజయవాడలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతపై కేసు నమోదు


    ఇక మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు వైఎస్సార్ ఈజీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ. 15,000 అందివ్వడంతో, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ళ వయస్సుగల పేదమహిళలందరికీ లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం పేర్కొంది.

    ఇది చదవండి: వైసీపీలో ఆ లక్కీఛాన్స్ దక్కించుకునే నేతలెవరు..? సీఎం జగన్ మనసులో ఉన్నది వాళ్లేనా..?



    మహిళల ఆర్ధికాభివృద్ధితో పాటు సంక్షేమం, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్‌, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ళ నియామకం చేపట్టినట్లు తెలిపింది. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెల్లడించింది.

    ఇది చదవండి: పార్టీపై దృష్టిపెట్టిన సీఎం జగన్..? మూడు నెలల యాక్షన్ ప్లాన్ రెడీ..!


    అలాగే 1వ తరగతి నుండి 12 వ తరగతి వరకు పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే డ్వాక్రా మహిళలకు రూ. 25 వేల కోట్ల రుణ బకాయిలను ఈ ప్రభుత్వమే నాలుగేళ్ళపాటు చెల్లిస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి సహకరిస్తున్నామన్నారు. రుణాలపై వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు