Home /News /andhra-pradesh /

AP GOVERNMENT TO GIVE FREE TABS TO CLASS 8TH STUDENTS FROM SEPTEMBER AS CM JAGAN ISSUED KEY ORDERS FULL DETAILS HERE PRN GNT

AP Government: సెప్టెంబర్ నాటికి విద్యార్థులకు ట్యాబ్‌లు.. ఏపీలో ఇకపై డిజిటల్ చదవులే.. సీఎం ఆదేశాలు..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

సెప్టెంబర్ లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చి తీరుతామని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు (స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

    సెప్టెంబర్ లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చి తీరుతామని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు (స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. క్లాస్ రూముల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించిన జగన్.., బైజూస్‌ (BYJU’S) తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై చర్చించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.., సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని స్పష్టం చేశారు. ఆ ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని ఆదేశించారు. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలని.., ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు.

    టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలన్న సీఎం.., 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలన్నారు. అంటే మూడేళ్లపాటు ట్యాబ్‌ నాణ్యతతో పనిచేయాలని.., అందుకే నిర్వహణ కూడా అంత్యంత ముఖ్యమన్నారు. ఏదైనా సమస్య వస్తే.. వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్న జగన్.. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

    ఇది చదవండి: గుడివాడ మహానాడు వాయిదాతో చంద్రబాబు కీలక నిర్ణయం.. అప్పటివరకు నో ప్రోగ్రామ్స్..


    అలాగే తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.., దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించాలని సీఎం ఆదేశించారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలన్న సీఎం.., తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలని సూచించారు. బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా.. అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలని స్పష్ చేశారు.



    ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్న సీఎం.., వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయని చెప్పారు. వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, ఎనలార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలన్న సీఎం.., దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలని సూచించారు. దీనిపై జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధంచేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, EDUCATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు