త్వరలో ఏపీ ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ... ప్రత్యేకతలు ఇవీ...

Andhra Pradesh : ఇప్పటివరకూ రైస్‌లో మనం సోనామసూరీ సహా రకరకాలు చూశాం. ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ రైస్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 15, 2019, 12:33 PM IST
త్వరలో ఏపీ ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ... ప్రత్యేకతలు ఇవీ...
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - World Food Programme)
  • Share this:
Fortified Rice Distribution : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... పశ్చిమగోదావరి జిల్లాలో ముసలివారికీ, గర్భిణీలకు ఫోర్టిఫైడ్ రైస్‌ని పంపిణీ చెయ్యాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణ బియ్యానికీ, ఫోర్టిఫైడ్ రైస్‌కీ తేడా ఉంది. వ్యాధుల నివారణ కోసం ఈ తరహా బియ్యాన్ని... ముసలివాళ్లు, గర్భిణీల కోసం పంపిణీ చెయ్యబోతున్నారు. ఈ రైస్ వల్ల కీళ్ల నొప్పులు, ఆయాసం లాంటివి తగ్గుతాయి. నిరు పేదల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు ఈ బియ్యాన్ని సరఫరా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాను ఎంచుకుంది.

ఫోర్టిఫైడ్ రైస్ అంటే : ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు, వివిధ హాస్టళ్లలోని విద్యార్థులకు రక్తహీనత రాకుండా పౌష్టికాహారం కలిసిన బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ అని అంటున్నారు. ప్రతీ 100 కేజీల సాధారణ బియ్యంలో ప్రత్యేకంగా కొన్ని పోషకాలతో తయారు చేసిన కేజీ బియ్యాన్ని కలుపుతారు. తద్వారా పౌష్టికాహార సమస్య కొంతవరకైనా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రైస్‌ ఫోర్టిఫికేషన్‌పై గత టీడీపీ ప్రభుత్వం, అధికారులు సమీక్ష జరిపారు. పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం తప్పనిసరి అని భావించారు. రైస్ ఫోర్టిఫికేషన్ ద్వారా విటమిన్ ఎ, డి అందుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దాంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ జరుగుతోంది. ఇందుకు సంబంధించి టాటా ట్రస్ట్ ఏపీకి సహకారం అందిస్తోంది.

ఫోర్టిఫైడ్ రైస్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని భావించిన వైసీపీ ప్రభుత్వం దాన్ని మరింత విస్తరించే క్రమంలో... పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ముసలివారికీ, గర్భిణీలకూ ఫోర్టిఫైడ్ రైస్‌ని పంపిణీ చెయ్యబోతోంది. ఇది సక్సెస్ అయితే... రాష్ట్రమంతా ఇలాంటి రైస్‌ని పంపిణీ చెయ్యడతోపాటూ... రేషన్ కింద కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకుంది. 

Pics : అందాల బొమ్మ ఐరెన్ క్యూట్ ఫొటోస్ 

ఇవి కూడా చదవండి :


ఏపీలో రైతు భరోసా ప్రారంభించిన సీఎం జగన్... కౌలు రైతులకు చెక్కుల పంపిణీ

నేడు ఉత్తరాంధ్రలో పైడితల్లి సిరిమానోత్సవం... ఇదీ చరిత్ర

ఆర్టీసీ జేఏసీతో నేడు ప్రభుత్వం చర్చలు ?... సమ్మెను సాయంత్రం విరమిస్తారా?

Health Tips : మంచి తేనెను గుర్తించడం ఎలా?


Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading