ఏపీ రైతులకు జగన్ షాక్... సగం మందికి రైతు భరోసా నిల్?

Andhra Pradesh : ప్రభుత్వాలు పొదుపు మంత్రం పాటిస్తే తప్పులేదు. కానీ... ఆ పేరుతో లబ్దిదారులకు కోత పెడితే అది తప్పే అవుతుంది. మరి రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్... చేస్తున్నదేంటి?

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 8:31 AM IST
ఏపీ రైతులకు జగన్ షాక్... సగం మందికి రైతు భరోసా నిల్?
వైఎస్ జగన్...
  • Share this:
Andhra Pradesh : మనకు తెలుసు... నవరత్నాల హామీలతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. వన్ బై వన్ ఒక్కో నవరత్నాన్నీ అమలుచేస్తూ వెళ్తోంది. ఐతే... ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఏ పథకం అమలు చేద్దామన్నా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అందువల్ల ఒకటికి రెండుసార్లు ఆలోచించి అమలు చేస్తోంది. తాజాగా రైతు భరోసా పథకంపై సమీక్ష చేసింది. వచ్చే నెలలో ఈ స్కీం అమలు చేయాల్సి ఉంది. మరి ఏ రైతులకు పథకం ప్రయోజనం అందాలి అనే అంశంపై కసరత్తులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ అనే స్కీం ద్వారా ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికీ రూ.6వేలు ఇస్తోంది. అందులో ఉన్న షరతులనే రైతు భరోసా పథకానికీ అమలు చెయ్యాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు... వాటితోపాటూ కౌలు రైతుల్ని గుర్తించడానికి మరిన్ని కండీషన్లు కూడా పెట్టబోతోంది. అందువల్ల రైతు భరోసా స్కీం వల్ల ప్రయోజనం పొందే రైతుల సంఖ్య సగానికి తగ్గబోతోంది.

ప్రస్తుతం ఏపీలో కౌలు రైతులతో కలిపి 64లక్షల 7వేల మంది ఉన్నారు. వాళ్లందరికీ రైతు భరోసా కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. వాళ్లలో భూమి ఉన్నవారు 48.7 లక్షల మంది రైతులు. భూమి లేని కౌలు రైతులు 15.37 లక్షల మంది. అందరికీ పథకం వర్తించేలా చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు తెస్తున్న రూల్స్ ప్రకారం చూస్తే... మాగ్జిమం 36 లక్షల మంది మాత్రమే పథకాన్ని పొందేలా కనిపిస్తోంది.

భరోసా డబ్బులోనూ కోత : మరో షాకింగ్ విషయం ఏంటంటే... ఏపీ ప్రభుత్వం రైతు భరోసా స్కీం కింద ప్రతీ రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.12,500 ఇస్తానని ప్రకటించింది. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారంటే... కేంద్రం పీఎం కిసాన్ స్కీం కింద ఇస్తున్న రూ.6వేలు పోగా... మిగతా రూ.6,500 మాత్రమే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోందని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం కేంద్రం పథకంతో సంబంధం లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.12,500 ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరుతున్నారు.

పీఎం కిసాన్ కూడా మోసమేనా? : పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం... ఏపీలో 42.54 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.2వేలను వారి ఖాతాల్లో వేసింది. అది ఎన్నికల సమయం. తీరా ఎన్నికలు అయిపోయాక... రెండో విడత సాయాన్ని 33.21 లక్షల మంది రైతుల అకౌంట్లలో మాత్రమే వేసింది. అంటే 9.33 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టింది. ఇక మూడో విడత సాయంగా 29.45 లక్షల మంది రైతులకే డబ్బు ఇచ్చింది. ఈసారి మరో 3.75లక్షల మందికి ఇవ్వలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం అడ్డమైన రూల్స్ పెట్టి... 13న్నర లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ స్కీం కింద డబ్బులు ఇవ్వకుండా మానేసింది. ఈ రూల్సే ఏపీ ప్రభుత్వం కూడా తీసుకుంటోంది కాబట్టి... ఏపీలో రైతు భరోసా ఎక్కువ మంది రైతులకు దక్కే అవకాశాలు కనిపించట్లేదు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>