ఏపీలో రేపే పదవుల పండగ.. వైసీపీలో నేతల్లో ఉత్కంఠ

BC Corporations in Andhra Pradesh: పురుషులు కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌పదవులు ఇవ్వాలని జగన్ సర్కార్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 29, 2020, 8:09 PM IST
ఏపీలో రేపే పదవుల పండగ.. వైసీపీలో నేతల్లో ఉత్కంఠ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో రేపు భారీ ఎత్తున కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనుంది జగన్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి పార్టీ నాయకత్వం కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. పార్టీకి విధేయులుగా ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తూ.. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 56 కులాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్‌లను ప్రకటించనుంది. ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో కులాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి ఆయా కార్పొరేషన్లు తోడ్పాటు అందించనున్నాయి.

మొత్తంగా 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్న జగన్ సర్కార్.. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. 30 వేల పైబడి జనాభా ఉన్నవాందరికీ కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులుకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌పదవులు ఇవ్వాలని జగన్ సర్కార్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్ పర్సన్ పదువులు దక్కనున్నాయి.

డైరెక్టర్ల పదవుల్లో యాభైశాతం మహిళలకు దక్కనున్నట్టు తెలుస్తోంది. ఛైర్మన్‌ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. అలాగే డైరెక్టర్ల పదవుల్లోనూ వీలైనన్ని జిల్లాలకు కేటాయించనున్నారు. ఇక మొత్తం కార్పొరేషన్ పదవుల్లో అనంతపురం జిల్లాకు 4 పదవులు, చిత్తూరు 4, తూర్పు గోదావరి 4, గుంటూరు 4, కడప 4, కృష్ణా 5, కర్నూలు 4, నెల్లూరు 4, ప్రకాశం 4, శ్రీకాకుళం 6, విశాఖ 5, విజయనగరం 4, పశ్చిమ గోదావరి జిల్లాకు 4 పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 29, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading