Home /News /andhra-pradesh /

AP GOVERNMENT TAKE KEY DECISION ON SCHOOLS AND COLLEGE NGS

Andhra Pradesh: స్కూళ్లు, కాలేజీలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన : సంక్షోభ సమయంలో తప్పలేదంటున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఆదిమూలపు సురేష్(ప్రతీకాత్మక చిత్రం)

ఆదిమూలపు సురేష్(ప్రతీకాత్మక చిత్రం)

ఏపీలో స్కూళ్లు, కాలేజీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో నష్టమైన ఆ నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

  ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుంతోంది. ముఖ్యంగా స్కూలు, కాలేజ్ విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అవుతుండడంతో కలవరపడుతోంది. ప్రస్తుతం ఏపీ పరిస్థితి కాస్త భయపెట్టేలానే ఉంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. నాలుగు నెలల తరువాత అత్యధికంగా శుక్రవారం దాదాపు వేయి కేసులు నమోదు అవ్వడంతో సెకెండ్ వేవ్ మొదలైందనే భయాలు వెంటాడుతున్నాయి. ప్రజలు సైతం భయం భయంగానే గడుపుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు..


  తాజాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యా సంస్థలోనూ పక్కా ప్రణాళికలతో విద్యా సంవత్సరాన్ని గాడిలో పెడుతున్నామని.. కానీ ప్రస్తుతం ఇలాంటి తరుణంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన పెంచుతోంది అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన కాలేజీలు, స్కూళ్లను వెంటనే మూసేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున సంక్షోభం తలెత్తినపుడు కొంత నష్టం తప్పక ఉంటుందని మంత్రి నిట్టూర్చారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలు, కళాశాల యజమానులు, అధికారులకు సూచించారు. కరోనా నిబంధనలు పాఠించని స్కూళ్లపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యార్థులకు కరోనా టెస్టుల సంఖ్య పెంచుతామని అయన ఈ సందర్భంగా తెలియజేశారు.

  అయితే ఇటీవల స్కూళ్లను, కాలేజీలను మూసే ప్రసక్తే లేదని చెప్పారు. ఆన్ లైన్ క్లాస్ ల వల్ల నష్టాలే ఎక్కువ ఉన్నాయని అందుకే స్కూళ్లూ మూయడం సరైన విధానం కాదని మంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆయా కాలేజీలు, స్కూళ్లను మాత్రమే మూసేయాలి అంటున్నారు.. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికైనా వాటిని కట్టడి చేసే మార్గాలను అన్వేషించకపోతే మరోసారి భారీగా నష్టం తప్పకపోవచ్చు.  మరోవైపు విశాఖపట్నం జిల్లా DMHO డాక్టర్ సూర్యనారాయణతో వైద్య శాఖ మంత్రి ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో 1500 వందల మందికి కరోనా పరీక్షలు చేయగా 65మందికి కరోనా నిర్ధారణ అయ్యింది అని..మహిళల హాస్టల్ లో 500 మందికి శనివారం కరోనా పరీక్షలు చేస్తే 200 మందికి నెగెటివ్ వచ్చింది.మిగిలిన 300మంది ఇంజనీరింగ్ మహిళ విద్యార్థునుల కరోనా రిపోర్ట్ రావాల్సి ఉందని వివరణ ఇచ్చారు.ప్రతి రోజు 7వేల5వందలు వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
  విశాఖపట్నం జిల్లాలో 6కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసామన్నారు. విశాఖపట్నంలో KGH హాస్పిటల్, అనకాపల్లి,విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ కరోనా బాధితుల కోసం 1000 బెడ్స్ సిద్ధం చేసామన్నారు. కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం KGH హాస్పిటల్ లో 15 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు మంత్రి ఆళ్ల నాని. మార్కెట్లు, వారంతపు సంతలు, ప్రజా రవాణా లో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయలు, ప్రవేశ ప్రాంతంలో తప్పనిసరిగా ధర్మల్ స్కానింగ్, శానిటైజర్ వినియోగించాలన్నారు. 65సంవత్సరాలు దాటిన వారు, ధీర్గ కాలిక వ్యాధులు ఉన్న వారు, గర్భవతులు,10 సంవత్సరాలలోపు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా పాజిటివ్ తెలిన వ్యక్తిని 14 రోజులు ముందు కలిసిన వారిని క్వారంటైన్ లో ఉంచాలన్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Schools, Corona, Corona Possitive, Corona virus

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు