2020లో ఇవీ ఏపీలో సెలవులు... లిస్ట్ రిలీజ్

Andhra Pradesh : సెలవులు అంటే అందరికీ ఇష్టమే. ఏపీ ప్రభుత్వం అన్ని లెక్కలూ వేసుకొని... 2020లో మొత్తం 23 సెలవులు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 6, 2019, 7:06 AM IST
2020లో ఇవీ ఏపీలో సెలవులు... లిస్ట్ రిలీజ్
ఏపీ సీఎం జగన్
  • Share this:
Andhra Pradesh : పండగ సెలవులు ఆదివారం రాకపోతే బాగుండు అని అంతా అనుకుంటారు. కానీ ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన 2020 పండగ సెలవుల్లో నాలుగు పండగలు ఆదివారమే వచ్చాయి. రిపబ్లిక్‌డే, జగ్జీవన్‌రాం జయంతి, మొహర్రం, విజయదశమి పండుగలు ఆదివారం వచ్చాయి, దీపావళి రెండో శనివారం వచ్చింది. ప్రభుత్వ ఆఫీసులకు రెండో శనివారం, ఆదివారం సెలవు అని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల మొత్తం 23 రోజుల సెలవుల్లో వాస్తవంగా సెలవులు లభించేది... 18 రోజులు అనుకోవచ్చు. ఐతే... రెండో శనివారానికి ముందు శుక్రవారం లేదా... రెండో ఆదివారం తర్వాత సోమవారం పండగ సెలవు ఉంటే... వరుసగా మూడు రోజులు సెలవులు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐతే... ప్రభుత్వం ప్రకటించిన 18 ఆప్షనల్ సెలవుల్లో ఎవరైనా సరే... ఐదుకి మించి వాడుకోకూడదు. అంటే... 13 సెలవులు ఉన్నా లేనట్లే అనుకోవచ్చు. రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, ఈద్‌ మిలాదున్‌ నబీ పండుగలకు నెలవంక కనిపించే సమయాన్ని బట్టి డేట్లు అటూ ఇటుగా మారే ఛాన్స్ ఉంది. అలాగే హిందూ పండుగలకు పంచాంగాల్లో తేదీలు మారితే... సెలవుల తేదీలు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఎన్‌ఐ చట్టం కింద బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

పండగ తేదీ వారం
భోగి 14-1-2020 మంగళ

సంక్రాంతి 15-1-2020 బుధ
కనుమ 16-1-2020 గురు


గణతంత్ర దినోత్సవం 26-1-2020 ఆది
మహా శివరాత్రి 21-2-2020 శుక్రఉగాది 25-3-2020 బుధ
శ్రీరామ నవమి 02-4-2020 గురు
బాబూ జగ్జీవన్‌రాం జయంతి 05-4-2020 ఆది
గుడ్ ఫ్రైడే 10-4-2020 శుక్ర
అంబేద్కర్ జయంతి 14-4-2020 మంగళ
రంజాన్ 25-5-2020 సోమ
బక్రీద్ 01-8-2020 శని
కృష్ణాష్టమి 18-8-2020 మంగళ
స్వాతంత్ర్య దినోత్సవం 15-8-2020 శని
వినాయక చవితి 22-8-2020 శని
మొహర్రం 30-8-2020 ఆది
మహాత్మాగాంధీ జయంతి 2-10-2020 శుక్ర
దుర్గాష్టమి 24-10-2020 శని
విజయదశమి 25-10-2020 ఆది
ఈద్ మిలాదున్ నబీ 30-10-2020 శుక్ర
దీపావళి 14-11-2020 శని
క్రిస్మస్ 25-12-2020 శుక్ర

 

Pics : అందాల బ్యూటీ అశ్రితా శెట్టి క్యూట్ పిక్స్
ఇవి కూడా చదవండి :

ఇంట్లో ముసలివాళ్లను పట్టించుకోవట్లేదా... ఐతే జైలు శిక్షే...

పాముకాటుతో మహిళ మృతి కేసులో కొత్త ట్విస్ట్... పోలీసులకే షాక్...

సోషల్ మీడియాపై స్కాన్... వివాదాస్పద పోస్టులు పెడితే... దబిడ దిబిడే...

Health : జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : రోజూ ఇవి తినండి... బరువు తగ్గడం గ్యారెంటీ
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>