ఏపీ ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే అన్నదాత సుఖీభవ పథకం కింద... లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో రూ.3000 చొప్పున డబ్బు జమచేసింది. మొత్తం 44,99,843 ఖాతాల్లో రూ.1349 కోట్లు జమ చేసింది. ఫిబ్రవరిలోనే ఈ స్కీం తెచ్చిన ప్రభుత్వం తొలి విడతగా... రూ.1000 చొప్పున బ్యాంక్ అకౌంట్లలో వేసింది. ఐతే... ఈ స్కీంని కేంద్రం తెచ్చిన కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని విస్తరిస్తూ తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కిసాన్ సమ్మాన్ కింద కేంద్రం రైతుల కుటుంబాలకు ఏటా రూ.6000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అది సరిపోదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... తాము అదనంగా రూ.9000 చొప్పున రైతుల కుటుంబాలకు ఇస్తామని ప్రకటించింది. తద్వారా ఏపీలో లబ్దిదారులైన రైతుల కుటుంబాలకు ఏడాదికి రూ.15000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.
తాజా జమతో కలిపి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ రైతు కుటుంబాల అకౌంట్లలోకి రూ.4000 జమచేసినట్లైంది. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం కొనసాగితే... ఏడాది లోపు రూ.11000 జమ చేయాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వం మారితే... కొత్త ప్రభుత్వం ఏ స్కీం అమలు చేస్తుందో అది ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
ప్రధాని మోదీకి ఝలక్... నమో టీవీపై వివరణ కోరిన ఈసీ
దేశ ద్రోహులతో కాంగ్రెస్... దేశభక్తులతో బీజేపీ... అరుణాచల్‌ప్రదేశ్‌లో విరుచుకుపడిన ప్రధాని మోదీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Congress, Chandrabab, Tdp