Movie Tkckets Issue: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గత కొంతకాలంగా భీమ్లానాయక్ (Bheemla Nayak) వర్సెస్ ప్రభుత్వం అన్న తీరుగా వివాదం నడిచింది. కేవలం పవన్ ప్యాన్స్, జనసైనికులు మాత్రమే కాదు.. విపక్షాలు సైతం ప్రభుత్వం తీరును తప్పు పట్టాయి. కేవలం పవన్ కల్యాణ్ (Pawan Kalyan )పై పగతోనే ఏపీ ప్రభుత్వం (AP Government) టికెట్ల ధరలను పెంచలేదని.. హామీ ఇచ్చినా నిర్ణయం వాయిదా వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ (RRR), రాధే శ్యామ్ (Radhe Shyam) లాంటి పెద్ద సినిమాలకు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం జగన్ ను కలిసిన సమయంలో ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, రాధే శ్యామ్ హీరో ప్రభాస్ కూడా ఉన్నారు. దీంతో ఆ సినిమాల రిలీజ్ కు ముందే కొత్త జీవో విడుదల అయ్యింది.
వకీల్ సాబ్ రిలీజ్ కు ముందు సినిమా టికెట్స్ ధరలపై టాలీవుడ్ ప్రముఖులకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య మొదలైన మాటల యుద్ధం.. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తరువాత కొన్ని రోజులకు సద్దుమణిగింది. అయితే ప్రభుత్వం కావాలనే ఈ నిర్ణయాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేసిందని.. విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కు ఇబ్బంది పెట్టడానికి ఇంతకాలం నిర్ణయాన్ని వాయిదా వేసింది అని పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఏపీ కొత్త జీవోపై త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాల నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడిపై సీఎం సీరియస్.. వయసుకైనా గౌరవం ఇవ్వరా అని ప్రశ్న
తాజాగా రాధేశ్యామ్ విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ఆ చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేసింది. అలాగే రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందే ప్రభుత్వం జీవో జారీ చేస్తే సంతోషిస్తానంటూ కోరారు. అయితే వారి కోరిక ప్రకారం.. ఈరోజు రాత్రి లేదా… రేపు సినిమా టికెట్ ధరలపై జీవో జారీ చేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక కొత్తగా జారీ చేసే జీవో ఎలా ఉంటుంది అని పెద్ద సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని థియేటర్లకు ఊరటనిచ్చే విధంగా ఈ కొత్త ధరలు ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే.. త్వరలో విడుదలయ్యే సినిమాలకు లాభం కలగడం ఖాయం అనిపిస్తోంది.
ఇదీ చదవండి: ప్రస్తుతం ఏపీ రాజధాని హైదరాబాదే.. కొత్త చర్చకు తెరలేపిన మంత్రి బొత్స
జీవో ప్రకారం కొత్త ధరలు ఇవే..
కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100
కార్పొరేషన్లలో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60
కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.125
కార్పొరేషన్ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.150, రూ.250
మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80
మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50
మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ.100
మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.125, రూ.250
నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70
నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40
నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90
నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.100, రూ.250
మరి ఈ కొత్త జీవోతో అయినా టాలీవుడ్ -ప్రభుత్వానికి మధ్య వివాదం ముగిసిపోతుందో లేదో చూడాలి.. దీనిపై సినిమా నిర్మాతలు పూర్తి స్థాయిలో స్పందించాల్సి ఉంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Radhe Shyam, Rrr film, Tollywood