విశాఖలో గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... చికిత్స పొందుతున్న బాధితులకు కూడా మెరుగైన ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు నిన్న విశాఖలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత తొందరగా విడుదల చేయాలని ఏపీ సీఎం జగన్ ఈ రోజు సీఎస్ నీలం సాహ్నిని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వం ఈ మేరకు రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విశాఖ జిల్లా కలెక్టర్కు ఈ మొత్తాన్ని బదిలీ చేసింది. బాధితులకు పరిహారం అందేలా విశాఖ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
విశాఖ బాధితులకు పరిహారం కోసం నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.