Home /News /andhra-pradesh /

AP GOVERNMENT NOTIFIED NEW ADDRESSES FOR NEW DISTRICT OFFICE BUILDINGS FULL DETAILS HERE PRN

AP New Districts: ఏపీ కొత్త జిల్లాల కలెక్టరేట్లు ఇవే.. ఏ జిల్లా ఆఫీస్ ఎక్కడంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ప్రభుత్వం.. కార్యాలయాలను కూడా సిద్ధం చేసింది. కలెక్టరేట్ల చిరునామాలను నోటిఫై చేసింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నేటి నుంచి కొత్త జిల్లాల (New Districts) అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతమున్న 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి రాష్ట్రంలో 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ప్రభుత్వం.. కార్యాలయాలను కూడా సిద్ధం చేసింది. చాలా వరకు ప్రభుత్వ భవనాల్లోనే కలెక్టరేట్లు ఏర్పడగా.. కొన్నిచోట్ల ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల కలెక్టరేట్లు కూడా సిద్ధమవడంతో ప్రభుత్వం కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

    ప్రభుత్వం నోటిఫై చేసిన కలెక్టరేట్ల విషయానికి వస్తే..

    • శ్రీకాకుళం జిల్లా - కొత్తపేట జంక్షన్‌, శ్రీకాకుళం

    • విజయనగరం జిల్లా - కంటోన్‌మెంట్‌, విజయనగరం

    • విశాఖపట్నం జిల్లా – మహారాణిపేట, విశాఖపట్నం

    • మన్యం పార్వతీపురం జిల్లా - గిరిజన సంక్షేమ భవనం, పార్వతీపురం

    • అనకాపల్లి జిల్లా - ఇండో-అమెరికన్ ఇనిస్టిట్యూట్, శంకరం గ్రామ పంచాయతీ, అనకాపల్లి

    • అల్లూరి సీతారామరాజు జిల్లా – యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC), పాడేరు

    • కాకినాడ జిల్లా - పాత కలెక్టరేట్, కాకినాడ

    • కోనసీమ జిల్లా - జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం, అమలాపురం

    • తూర్పు గోదావరి జిల్లా - నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్, రాజమహేంద్రవరం

    • ఏలూరు జిల్లా - పాత కలెక్టర్ భవనం, ఏలూరు

    • పశ్చిమ గోదావరి జిల్లా - శ్రీచైతన్య ఇంజినీరింగ్ కలశాల భవనం, భీమవరం

    • కృష్ణా జిల్లా - పాత కలెక్టరేట్ భవనం, మచిలీపట్నం

    • ఎన్టీఆర్ జిల్లా - సబ్ కలెక్టరేట్ కార్యాలయం, బందర్ రోడ్ విజయవాడ

    • గుంటూరు జిల్లా – పాతకలెక్టరేట్ కార్యాలయం, నగరం పాలెం, గుంటూరు

    • బాపట్ల జిల్లా – మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, బాపట్ల

    • పలనాడు జిల్లా - జలవనరుల శాఖ కార్యాలయ భవనం, నరసరావుపేట

    • ప్రకాశం జిల్లా - పాత కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు

    • నెల్లూరు జిల్లా- పాత కలెక్టరేట్ కార్యాలయం, నెల్లూరు

    • తిరుపతి జిల్లా - పద్మావతి నిలయం, తిరుపతి

    • చిత్తూరు జిల్లా - పాత కలెక్టర్ కార్యాలయం, రెడ్డిగుంట, చిత్తూరు

    • అన్నమయ్య జిల్లా – ప్రభుత్వ భవనం, రింగ్ రోడ్ సమీపంలోని రాజీవ్ స్వగృహ భవనాల పక్కన, రాయచోటి

    • కడప జిల్లా - కొత్త కలెక్టర్ కార్యాలయం సి బ్లాక్, రిమ్స్ రోడ్, కడప

    • అనంతపురం జిల్లా – పాత కలెక్టర్ కార్యాలం, బెంగళూరు రోడ్డు, అనంతపురం

    • సత్యసాయి జిల్లా - సత్య సాయి మిర్పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, మెయిన్ రోడ్, పుట్టపర్తి

    • కర్నూలు జిల్లా - కలెక్టర్ కార్యాలయం, బుధవారపేట, కర్నూలు

    • నంద్యాల జిల్లా - ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భవనం, నూనెపల్లి, నంద్యాల


    ఇది చదవండి: మరో బాదుడికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. మరో మూడేళ్లు ఛార్జీల మోతే..


    ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఆయా జిల్లాలకు చెందిన అన్ని కార్యకలాపాలు ఈ చిరునామా నుంచే జరుగుతాయని.. ప్రజలు, అధికారులు, సిబ్బంది సంబంధిత చిరుమానాల్లోని కలెక్టరేట్లలో సంప్రదించాలని స్పష్టం చేసింది. మరోవైపు దాదాపు అన్ని జిల్లాల కలెక్టరేట్లను ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం.., 2023 నాటికి శాశ్వత భవనాలు నిర్మించే విధంగా కార్యాచరణ రూపొందించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP new districts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు