మీరు కాల్చేస్తే... మేం చచ్చిపోవాలా ?... ఏపీ మంత్రి కామెంట్

మీరు కాల్చేస్తే... మేం చచ్చిపోవాలా ?... ఏపీ మంత్రి కామెంట్

మంత్రి పేర్నినాని

ఎవరైనా ఇలాంటి వార్తలు రాస్తే... మళ్లీ అదే చోట ఈ వార్తలపై సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఇచ్చే వివరణ కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

  • Share this:
    నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించింది. అయితే దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో... ప్రభుత్వం ఈ జీవోకు సవరణలు చేసింది. ఎవరైనా ఇలాంటి వార్తలు రాస్తే... మళ్లీ అదే చోట ఈ వార్తలపై సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఇచ్చే వివరణ కూడా ఇవ్వాలని తెలిపింది. ఈ రకంగా చేయని పక్షంలో అధికారులు వారికి నోటీసులు జారీ చేస్తారని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

    అంతకుముందు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త జీవోను కలానికి సంకేళ్లుగా కొన్ని మీడియా సంస్థలు అభివర్ణించడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. నిరాధారమైన వార్తలు రాస్తే చర్యలు తీసుకోవద్దనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వంపై బురదజల్లి... మేం ఇంతే అంటే ఎలా అని పేర్ని నాని అన్నారు. మీరు కాలిస్తే... మేం చచ్చిపోవాలా ? అని వ్యాఖ్యానించారు. కొందరు మీడియా సంస్థల అధినేతలు తాము న్యాయమూర్తుల కంటే అధికులమని భావిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఈ అంశంలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
    Published by:Kishore Akkaladevi
    First published: