Home /News /andhra-pradesh /

AP GOVERNMENT LIFTS SUSPENSION ON SENIOR IPS AB VENKATESWARARAO FULL DETAILS HERE PRN

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తవేత.. పోస్టింగ్ పై సస్పెన్స్..

ఏబీ వెంకటేశ్వరరావు (ఫైల్)

ఏబీ వెంకటేశ్వరరావు (ఫైల్)

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

    సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ రీ ఇన్ స్టేడ్ అవుతందని తెలిపింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. టీడీపీ (TDP) ప్రభుత్వ హాయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సస్పెన్ష్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఐతే దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

    సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ రీ ఇన్ స్టేడ్ అవుతందని తెలిపింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. టీడీపీ (TDP) ప్రభుత్వ హాయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సస్పెన్ష్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఐతే దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ప్రభుత్వం సర్వీస్ లోకి తీసుకుంది. ఐతే పోస్ట్ మాత్రం కేటాయించలేదు.

    ఇది చదవండి: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. హద్దుమీరితే జరిమానా గ్యారెంటీ..!


    2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్ట్ నుంచి తొలగించింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేయడమే కాకుండా, అదే సంస్థకు తన కుమారుడు ఇండియాప్రతినిథిగా ఉన్న సంగతిని దాచి పెట్టింది. ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీవై ఆరోపణలున్నాయి.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.., రూల్స్ లేకుండానే నెలకు రూ.5వేలు.. ఇలా అప్లై చేసుకోండి..


    అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది.

    ఇది చదవండి: ఏపీలో కేజీఎఫ్ తరహా గోల్డ్ మైన్స్..? ఆ కొండల కింద అంతా బంగారమే..!


    దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. సస్పెన్షన్ అంశంపై న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఏబీకి అనూకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో పెగాసస్ కొనుగోలులో ఏబీకి పాత్ర ఉందని వైసీపీ ఆరోపించగా.. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని సీఎస్ ను కోరారు. ఆ తర్వాత కొన్నాళ్లకే సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఆయన్ను సర్వీస్ లోకి తీసుకున్న ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: AB venkateshwara rao, Andhra Pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు