హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఖరారు.. నోటిఫికేషన్ జారీ.. పూర్తి వివరాలివే..!

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఖరారు.. నోటిఫికేషన్ జారీ.. పూర్తి వివరాలివే..!

అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)

అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Session) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేష జారీ చేశారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (AP Assembly Budget Session) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేష జారీ చేశారు. ఈనెల 7న శాసనమండలి, ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 7 తేదీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సభ నివాళులర్పించనుంది. ఈనెలాఖరు వరకు అంటే 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా ప్రభుత్వం షెడ్యూల్ చేస్తోంది. ఈనెల 11 లేదా 14వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. రూ.2.50లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్( AP Budget) ఉండే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

  ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించి అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తైంది. ఈసారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలకు అధిక కేటాయింపులు జరిపే అవకాశముంది. అలాగే వ్యవసాయం పాడి పరిశ్రమపై దృష్టిపెడుతున్నట్లు సమాచారం.

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నోటిఫికేషన్

  ఇది చదవండి: అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా నిధుల కేటాయింపు..


  కీలక బిల్లులపై దృష్టి

  ఈ సమావేశాల్లో కేవలం బడ్జెట్ పైనే కాకుండా కొన్ని కీలక అంశాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. వీటిలో ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లుపై (AP Capital Issue) సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. సమగ్రమైన బిల్లులతో మళ్లీ వస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులను తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, ఓటీఎస్ అంశాలు చర్చకు రానున్నాయి.

  ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశా..! చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి.. 


  వీటితో పాటు ఇటీవల రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) అంశం అసెంబ్లీలో కీలకంగా మారనుంది. కొత్త జిల్లాల నోటిఫికేషన్ పై ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

  ఇది చదవండి: ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు  టీడీపీ వస్తుందా..?

  ఈ సమావేశాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హాజరవుతుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన సతీమణి గురించి అనుచితంగా మాట్లాడారంటూ మాజీ సీఎం చంద్రబాబు సభను విడిచి వెళ్లారు. అంతేకాదు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్లీ సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, AP Budget 2022

  ఉత్తమ కథలు