టీడీపీకి మరో షాక్... "బడికొస్తా" స్కీంపై దర్యాప్తుకి ఏపీ ప్రభుత్వం ఆదేశం...

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమాన్నీ అవినీతి లేకుండా నిర్వహించలేదా? అన్ని స్కీముల్లోనూ భారీ అవినీతి జరిగిందా? ఇలాంటి ఆరోపణలు చేసిన వైసీపీ... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక... ప్రతీ పథకంపై దర్యాప్తు జరిపిస్తోంది. తాజాగా ఆ లిస్టులో "బడికొస్తా" కూడా చేరింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 3, 2019, 6:25 AM IST
టీడీపీకి మరో షాక్...
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
వైసీపీ అధికారంలోకి రావడమే టీడీపీకి అతి పెద్ద దెబ్బ. ఆ తర్వాత సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం టీడీపీకి తలనొప్పిగానే మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం బడికొస్తా పథకం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మిగతా పథకాల్లో ఎలాగైతే... క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలనుకుంటోందో... అదే విధంగా ఈ స్కీంలో అక్రమాలపైనా క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించినట్లు సమాచారం. అసలేంటి ఈ స్కీం అంటే... సైకిల్ గుర్తు కలిగిన టీడీపీ... విద్యార్థినులకు పంచేందుకు... మొత్తం 3,80,275 సైకిళ్లు కొనాలని డిసైడైంది. ఇందుకోసం రూ.151 కోట్లు అంచనాగా కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సైకిళ్లు ఇచ్చే ఛాన్స్... చెన్నైకి చెందిన ఐటీ సైకిల్స్ కంపెనీ దక్కాల్సి ఉన్నా... ఇక్కడే గోల్ మాల్ జరిగినట్లు తెలిసింది.

చెన్నైకి చెందిన కంపెనీ కంటే... ఒక్కో సైకిల్‌కీ రూ.500 ధర పెంచి... పంజాబ్... లుథియానాకు చెందిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు. తక్కువ రేటుకే చేస్తానన్న చెన్నై కంపెనీని 15,000 సైకిళ్లు తయారుచేసి ఇమ్మన్నారు. అదే లూథియానాకు చెందిన రెండు కంపెనీలకు మాత్రం ఏకంగా 3,65,275 సైకిళ్ల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ రెండు కంపెనీలు టైముకి సైకిళ్లు చేసి ఇవ్వలేకపోయాయి. వాటికి ఎక్స్‌ట్రా టైమ్ కూడా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినా ఆ కంపెనీలు సరైన సైకిళ్లు చేసి ఇవ్వలేకపోయాయి. అవి పంపిన సైకిళ్లలో క్వాలిటీ లేదని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందుకే... ఈ స్కీం కింద ఇవ్వాల్సిన రూ.151 కోట్లలో ఇప్పటివరకూ రూ.30 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతా రూ.121 కోట్లూ ఇవ్వకుండా... దర్యాప్తుకి ఆదేశించింది.

ఈ సైకిళ్ల స్కీంలో అక్రమాలు నిజమేనని తేలితే... దాదాపు రూ.18 కోట్ల అవినీతి జరిగినట్లే అవుతుంది. అందుకు ఆధారాలు లభిస్తే... గత ప్రభుత్వాన్ని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కోర్టులో నిలబెట్టే అవకాశాలుంటాయి. దర్యాప్తు రిపోర్ట్ వస్తేగానీ నెక్ట్స్ ఏంటి అన్నది తెలియదు. ప్రస్తుతానికి "బడికొస్తా" స్కీం అటకెక్కినట్లే అనిపిస్తోంది.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు