Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో ఎన్నో మార్పులు చేస్తున్నా.. విద్యార్థుల హాజరు అనుకున్న స్థాయిలో లేదనే భావనతో ఉన్నట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్యను బాగా పెంచడమే లక్ష్యంగా ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తేవాలని నిర్ణయించింది. టెక్నాలజీని బాగా ఉపయోగించేందుకు సిద్ధమైంది. ఇకపై విద్యార్థులు కూడా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా అటెండెన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేయబోతోంది. ఇందులో ప్రారంభ లోటుపాట్లు ఉంటాయి కాబట్టి.. అన్నింటినీ సరిచేసుకుంటూ.. నవంబర్ నెలాఖరు లోగా విద్యార్థులు తమ ఫేషియల్ రికగ్నిషన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది.
15 నెలలు కీలకం :
వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికే మూడున్నరేళ్ల కాలం పూర్తైంది. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ సాధించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. అలా జరగాలంటే ప్రభుత్వ చేపట్టే పథకాల ప్రయోజనాలు స్పష్టంగా కనిపించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతోందనే భావనలో ఉన్నారు సీఎం జగన్. ఆ క్రమంలో అన్ని పథకాలనూ ఆయన పరిశీలిస్తున్నారని తెలిసింది. లోటుపాట్లను సరిచేస్తూ.. రాజీ పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే విద్యారంగంలోనూ ఇలాంటి మార్పుు తెస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణలో దారుణం.. ప్రసవం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్.. శిశువు మృతి
ఇప్పటికే జిల్లాల పర్యటనల్లో బిజీగా ఉంటున్న సీఎం జగన్.. అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఉత్తరాంధ్రను తరచూ కవర్ చేసేలా పర్యటనలను ఫిక్స్ చేసుకుంటున్నారు. ఎన్నికలు వచ్చేవరకూ నిరంతరం తాను, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Higher education, Students