నేటి నుంచీ ఏపీలో ప్రభుత్వ వైన్ షాపులు... భారీగా పెరిగిన ధరలు

దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం, బీర్, వైన్ ఇతర వెరైటీ మద్యంపై ఏఆర్ఈటీ పన్ను విధించారు. 90 మిల్లీ లీటర్ల బాటిల్‌కు గరిష్టంగా 10 రూపాయల పన్ను విధించారు.

news18-telugu
Updated: October 1, 2019, 5:36 AM IST
నేటి నుంచీ ఏపీలో ప్రభుత్వ వైన్ షాపులు... భారీగా పెరిగిన ధరలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు షాకిస్తూ మద్యం ధరలను భారీగా పెంచింది. అదనపు రిటైల్ టాక్స్ పేరుతో ఈ ధరలను పెంచారు. ఒక్కో బాటిల్ పై కనీసం 10 నుంచి గరిష్టంగా 250 వరకూ టాక్స్ విధించారు. నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుండటంతో.., పెరిగిన ధరలు కూడా అమల్లోకి వచ్చాయి. మద్య నిషేధ కార్యక్రమం అమలులో భాగంగా మద్యం బాటిళ్లపై ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం, బీర్, వైన్ ఇతర వెరైటీ మద్యంపై ఏఆర్ఈటీ పన్ను విధించారు. 90 మిల్లీ లీటర్ల బాటిల్‌కు గరిష్టంగా 10 రూపాయల పన్ను విధించారు. ఇక పరిమాణం పెరిగే కొద్దీ పన్ను రెట్టింపు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతం మేర తగ్గించింది ప్రభుత్వం. అంతేకాదు వైన్ షాపుల్లో మద్యం అమ్మే వేళల్లో కీలక మార్పులు చేసింది. నేటి నుంచి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంటాయని వెల్లడించింది ఏపీ సర్కార్. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మినా.. బెల్ట్ షాపులను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

నేటి నుంచి ప్రభుత్వం దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జరుగుతాయి. ఏపీలో 4,380 మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలోేనే నడుస్తాయి. పట్టణాలు, నగరాల్లోని మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ పనిచేస్తారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని తరిమేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 మహిళా కానిస్టేబుళ్లను నియమించింది ఏపీ ప్రభుత్వం.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>