HOME »NEWS »ANDHRA PRADESH »ap government has taken a key decision in the matter of marriage permits bn

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లిళ్ల అనుమతులు ఇక నుంచి..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లిళ్ల అనుమతులు ఇక నుంచి..
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లిళ్ల కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లిళ్లకు అనుమతి కోసం కలెక్టరేట్ నుంచి అనుమతి పొందే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.

  • Share this:
    కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య కాస్తంత ఎక్కువగానే ఉంది. అయితే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగానే ఉంటోంది. ఈ క్రమంలో అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ నిబంధనలను సైతం పక్కాగా అమలు చేసింది. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అందులో భాగంగానే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పెళ్లిళ్ల అనుమతుల విషయంలోనూ అప్రమత్తంగాఉంది. పెళ్లిళ్ల కోసం ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లిళ్లకు అనుమతి కోసం కలెక్టరేట్ నుంచి అనుమతి పొందే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.

    దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఇప్పటి నుంచి పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యత మండల పరిధిలోని తహసీల్దార్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలు కానుంది. దీంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది.



    పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం ఆదేశించింది. పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ.10 నాన్ జ్యూడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దారుకు అందించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని వారికి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం జీఓలో తెలిపింది.
    Published by:Narsimha Badhini
    First published:July 19, 2020, 10:48 IST

    टॉप स्टोरीज