Home /News /andhra-pradesh /

AP GOVERNMENT HAS CONSTRUCTED TEMPORARY COVID HOSPITAL WITH 500 BEDS ONLY IN 15 DAYS NEAR TADIPATRI ATP

CM Jagan: ఏపీ సర్కార్ మరో ఘనత... రెండు వారాల్లోనే జర్మన్ హ్యాంగర్ విధానంలో కోవిడ్ హాస్పిటల్ నిర్మాణం

వర్చువల్‌గా తాడిపత్రి తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్

వర్చువల్‌గా తాడిపత్రి తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ ప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించడం విశేషం. నేడు వర్చువల్ ద్వారా తాడిపత్రి కోవిడ్ హాస్పిటల్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దగ్గరుండి పర్యవేక్షించారు. 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో ఈ తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది.

ఇంకా చదవండి ...
  తాడిపత్రి: ఏపీ సర్కార్ మరో ఘనత సాధించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలతో 15 రోజుల్లో కోవిడ్ హాస్పిటల్ నిర్మాణాన్ని అధికారులు పూర్తిచేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ ప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించడం విశేషం. నేడు వర్చువల్ ద్వారా తాడిపత్రి కోవిడ్ హాస్పిటల్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దగ్గరుండి పర్యవేక్షించారు. 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో ఈ తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. జర్మన్ హ్యాంగర్ విధానంలో ఆసుపత్రిని అనంత అధికారులు నిర్మించారు. ఈ కోవిడ్ హాస్పిటల్ నిర్మాణంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రిలో కోవిడ్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆక్సిజన్ ఆధారంగా ఆసుపత్రిలోని కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందనుంది.

  అనంతపురం జిల్లా తాడిపత్రి అర్జాస్‌ స్టీల్స్‌ వద్ద 500 బెడ్ల కోవిడ్‌ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్‌ ద్వారా క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో, రికార్డు సమయంలో 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో జర్మన్‌ హ్యంగర్‌ టెంపరరీ కోవిడ్‌ హాస్పిటల్‌ నిర్మాణం జరిగింది. ప్రతీ పేషెంట్‌ బెడ్‌ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్‌ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు, మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బంది సేవలందించనున్నారు.

  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...
  ఈ కోవిడ్ హాస్పిటల్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించిన అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడిని సీఎం జగన్ అభినందించారు. కోవిడ్‌ టైంలో, ఆక్సిజన్‌ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్‌ స్టీల్‌కు ఎయిర్‌ సపరేషన్‌ ప్లాంట్‌ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్‌ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సీజన్‌ కెపాసిటీ ఉండడం, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని జర్మన్‌ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పనిచేశారని, పేరుపేరునా అందరికీ అభినందనలు తెలుపుతున్నానని సీఎం జగన్ చెప్పారు. అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

  CM Jagan, Tadipatri, AP Government, Tadipatri Covid hospital, German Hanger Technology

  ఈ కార్యక్రమానికి క్యాంప్‌ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Anantapuram, Ap cm jagan, AP News, Cm jagan, Covid hospital

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు