రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం... ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. కౌలు రైతులతో పాటు అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. రైతు భరోసా నుంచి ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా రైతు భరోసా వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. ఒక వేళ రైతు మరణిస్తే భార్యకు రైతు భరోసా సాయం అందించనుంది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.