హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Gautham Sawang: గౌతమ్ సవాంగ్ కు వీడ్కోలు.. డీజీపీగా చివరి సందేశం ఇదే..!

Gautham Sawang: గౌతమ్ సవాంగ్ కు వీడ్కోలు.. డీజీపీగా చివరి సందేశం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gautham Sawang) వీడ్కోలు కార్యక్రమం మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో జరిగిన కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ నుంచి కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gautham Sawang) వీడ్కోలు కార్యక్రమం మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో జరిగిన కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ నుంచి కొత్త డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్, రాజేంద్రనాథ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిగా గౌతమ్ సవాంగ్ చివరి ప్రసంగం చేశారు. తన 36 ఏళ్ల పోలీస్ సర్వీస్ నేటితో ముగుస్తోందని.. డీజీపీగా రెండు సంవత్సరాల 8 నెలలు పనిచేశానన్నారు. సీఎం ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నరేళ్లు పనిచేశానని.. ఇందులో భాగంగా చాలా సంస్కరణళు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థను మరింత దగ్గర చేసేందుకు యత్నించామన్న ఆయన.. గతంలో ఎన్నడూ చూడని విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తనను డీజీపీగా కొనసాగించిన సీఎంకు సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు.

  ఇక మహిళల రక్షణ కోసం దిశా మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామని.. బాధితులు స్టేషన్ కు రాకుండానే ఎఫ్ఐఆర్ లు నమోదయ్యేలా చర్యలు చేపట్టామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వీటిలో 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులేనని.. అలాగే 75 శాతం కేసుల్లో కోర్టులు శిక్షలు కూడా వేశాయన్నారు. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40వేలకు పైగా ఎఫ్ఆఆర్ లు నమోదయ్యాయన్న సవాంగ్.. స్పందన, ఆఫరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళళు, చిన్నారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

  ఇది చదవండి: ఆ అవసరం టీడీపీకే ఉంది.. వివేకా హత్యపై సజ్జల సంచలన కామెంట్స్..

  పోలీస్ శాఖలో డిజిటల్ వ్యవస్థను మరింత మెరుగుపరిచినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దిశ యాప్ ను 1.10 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకునేలా ప్రచారం చేశామన్నారు. అలాగే పోలీస్ సేవా వెబ్ సైట్ ద్వారా డిజిటల్ గా ఎఫ్ఐఆర్ కాపీలు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు సవాంగ్ తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి ఇన్ స్పెక్టర్ కార్యాలయం వరకు డిజిటల్‌గా అనుసంధానం చేశామన్నారు.

  ఇది చదవండి: అయ్యో దేవుడా..! అప్పటివరకు సరదాగా సాగిన ప్రయాణం.. అంతలోనే ఎంత ఘోరం..!

  ఇక కొత్త డీజీపీగా ఛార్జ్ తీసుకున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా పోలీసులు పనిచేయాలని.. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. చిన్నస్థాయిలో తప్పు జరిగినా అది డీజీపీ వరకు చెడ్డపేరు తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక పోలీసులపై వస్తున్న విమర్శలపైనా రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యల చేశారు. తప్పుడు ఆరోపణళపై పోలీసులు ఆందోళన చెందాల్సిన అసరం లేదని.. వాటిపై ఉన్నతస్థాయిలో విచారణ జరుపుతామన్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP Police, Gautam Sawang

  ఉత్తమ కథలు