విశాఖ భూ కుంభకోణంపై సిట్ వేసిన ఏపీ ప్రభుత్వం

Vizag Land Scam : ప్రభుత్వ సిట్ ఏర్పాటు నిర్ణయం టీడీపీకి తలనొప్పి వ్యవహారమే. ముఖ్యంగా టీడీపీలోని ఉత్తరాంధ్ర నేతలకు ఇది ఇబ్బంది కలిగించేదిగా భావిస్తున్నారు.

news18-telugu
Updated: October 18, 2019, 10:37 AM IST
విశాఖ భూ కుంభకోణంపై సిట్ వేసిన ఏపీ ప్రభుత్వం
సీఎం వైఎస్ జగన్
  • Share this:
Vizag Land Scam : విశాఖ భూముల అక్రమాలపై విచారణకు సిట్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిటైర్డ్ IAS విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా వైవీ అనురాధ, టి.భాస్కరరావును నియమించింది. ఈ సిట్... మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. విశాఖలో గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.3వేల కోట్లకు పైగా భూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పెద్ద సంఖ్యలో భూ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు మాయమయ్యాయి. కొన్నింటిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మాజీ మంత్రి గంటా లాంటి వారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అప్పట్లో గంటా ప్రకటించారు కూడా. అప్పట్లో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా... ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లోపభూయిష్టంగా ఉందని ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మండిపడింది. ఇప్పుడు అదే వైసీపీ అధికారంలోకి రావడంతో... అప్పటి అక్రమాలపై నిజానిజాల్ని బయటకు లాగడమే లక్ష్యంగా సిట్‌ని వేసింది.

ఈ సిట్ ఏర్పాటు అంశం టీడీపీ నేతలకు ఏమాత్రం మింగుడు పడనిదే. ఎందుకంటే... ప్రస్తుతం సీఎం జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయమూ తమకు ఇబ్బంది కలిగిస్తోందని టీడీపీ భావిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని రాక్షస పాలన అని అభివర్ణిస్తోంది. అయినప్పటికీ సీఎం జగన్ మాత్రం... తాను ఏం చెయ్యాలని అనుకుంటున్నారో అదే చేసుకుంటూ వెళ్తున్నారు. సిట్ రిపోర్ట్ కచ్చితంగా తమకు వ్యతిరేకంగా వస్తుందనే ఆలోచనలో ఉన్నాయి టీడీపీ వర్గాలు.

 

ఇవి కూడా చదవండి :

123 కేజీల బంగారం స్వాధీనం... విలువ రూ.48 కోట్లు

వావ్... చంద్రుడి అవతలివైపు ఫొటోతీసిన చంద్రయాన్-2

Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి

Published by: Krishna Kumar N
First published: October 18, 2019, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading