Home /News /andhra-pradesh /

AP GOVERNMENT FOCUS ON OCEAN WAVES POWER IN VISAKHAPATNAM AND KAKINADA NGS

Andhra PradesH: ఉప్పెనలా విద్యుత్ ఉత్పత్తి: సముద్రపు అలలతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం

సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి

సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి

సముద్ర తీరంలోని కెరటాలు, ఆటుపోట్ల శక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ, కాకినాడ మధ్య తీరాన్ని దీనికి అనువుగా ఎంచుకుంది. ఇది సక్సెస్ అయితే ఉప్పెనలో విద్యుత్ ఉత్పత్తి కానుంది.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స‌ముద్ర తీరంలోని కెర‌టాలు, ఆటుపోట్ల శ‌క్తి నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ, కాకినాడ మధ్య తీరంలో 100 కెవి అలల విద్యుత్‌ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాంప్రదాయేతర విద్యుత్‌ సంస్థ ఆధ్వర్యంలో అలల విద్యుత్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఇది అమల్లోకి వస్తే సాంప్రదాయేతర విద్యుత్‌ సంస్థ అధ్వర్యంలో సరికొత్త విప్లవానికి నాంది పలికినట్టే అవుతుంది.

    విశాఖ తీరం పరిధిలో ఏర్పాటుచేయనున్న విద్యుత్‌ కేంద్రానికి సంబంధించి ఇజ్రాయిల్‌కు చెందిన బికో వేవ్‌ పవర్‌ లిమిటెడ్‌ సంస్థ డెమానిస్ట్రేషన్‌ ఇవ్వనుంది. డెమానిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ సంస్థే భరించనుంది. ఇప్పటికే ఆ సంస్థ చెప్పిన లెక్కలపై ప్రభుత్వం సంతృప్తి చెందినట్టు సమాచారం. ఇక తొలి ప్లాంటు నుండి 170 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అదే సంస్థతో జెన్‌కో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

    మరిన్ని అలల విద్యుత్‌ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మొత్తాన్నీరాష్ట్ర జెన్‌కో కొనుగోలు చేయాలి. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇతర తీర ప్రారతాల్లో కూడా అలల విద్యుత్‌ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతను జాతీయ సముద్ర సాంకేతిక సంస్థకి అప్పగించనున్నారు. అధ్యయనం కోసం ఎన్‌ఐఓటి కి తొమ్మిదిన్నర లక్షలకుపైగా చెల్లిస్తారు. రాష్ట్ర తీరంలోని 12 ప్రాంతాల్లో దీనిపై అధ్యయనం చేయనున్నారు.

    సముద్ర తీరంలోని కెరటాలు, ఆటుపోట్ల శక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇరదులో భాగంగానే విశాఖ, కాకినాడ మధ్య తీరాన్ని దీనికి అనువుగా ఎంచుకుంది. మరిన్ని అలల విద్యుత్‌ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మొత్తాన్నీ రాష్ట్ర జెన్‌కో కొనుగోలు చేయాలి. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇతర తీర ప్రాంతాల్లో కూడా అలల విద్యుత్‌ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    అయితే అధ్యయనం స్థాయిలోనే ఉన్న అలల విద్యుత్‌ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తురడడంపై కొందరు నిఫుణులు ఆశ్చర్యకరం. ఎన్‌ఐఓటి ఇరకా రంగంలోకి దిగలేదు, విశాఖలో ఇజ్రాయిల్‌ సంస్థ డిమాన్‌స్ట్రేషన్‌ ప్రారంభం కాలేదు.. అయినా 170 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌ 3 రూపాయల చొప్పున విక్రయిరచేరదుకు ఎంఓయు చేసుకునేరదుకు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ణయించాడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. ఉప్పెనలా విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టొచ్చని ఆశిస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, AP News, Power s

    తదుపరి వార్తలు