హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Focus on Nandamuri: నందమూరి ఫ్యామిలీపై వైసీపీ ఫోకస్.. నారా కుటుంబానికి దూరం చేయడమే టార్గెట్..

YCP Focus on Nandamuri: నందమూరి ఫ్యామిలీపై వైసీపీ ఫోకస్.. నారా కుటుంబానికి దూరం చేయడమే టార్గెట్..

YCP Focus on Nandamuri: నందమూరి ఓట్లపై వైసీపీ ఫోకస్ చేసిందా? సామాజిక ఓట్ల ప్రకారం.. జగన్ కు కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ దూరంగానే ఉంటోంది. అయితే నందమూరి ఫ్యామిలీని తనవైపునకు తిప్పుకుంటే.. చంద్రబాబుకు ప్రధానంగా అండగా ఉంటున్నది నందమూరి అభిమానులు.. ఆ సామాజికి వర్గం వారే.. అందుకే ఆ వర్గాన్ని దూరం చేస్తే టీడీపీ ఒంటరి అవుతుందన్నది వైసీపీ ప్లాన్ లా కనిపిస్తోంది.

YCP Focus on Nandamuri: నందమూరి ఓట్లపై వైసీపీ ఫోకస్ చేసిందా? సామాజిక ఓట్ల ప్రకారం.. జగన్ కు కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ దూరంగానే ఉంటోంది. అయితే నందమూరి ఫ్యామిలీని తనవైపునకు తిప్పుకుంటే.. చంద్రబాబుకు ప్రధానంగా అండగా ఉంటున్నది నందమూరి అభిమానులు.. ఆ సామాజికి వర్గం వారే.. అందుకే ఆ వర్గాన్ని దూరం చేస్తే టీడీపీ ఒంటరి అవుతుందన్నది వైసీపీ ప్లాన్ లా కనిపిస్తోంది.

YCP Focus on Nandamuri: నందమూరి ఓట్లపై వైసీపీ ఫోకస్ చేసిందా? సామాజిక ఓట్ల ప్రకారం.. జగన్ కు కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ దూరంగానే ఉంటోంది. అయితే నందమూరి ఫ్యామిలీని తనవైపునకు తిప్పుకుంటే.. చంద్రబాబుకు ప్రధానంగా అండగా ఉంటున్నది నందమూరి అభిమానులు.. ఆ సామాజికి వర్గం వారే.. అందుకే ఆ వర్గాన్ని దూరం చేస్తే టీడీపీ ఒంటరి అవుతుందన్నది వైసీపీ ప్లాన్ లా కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

  YCP Focus on Nandamuri: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలోకి ఎప్పుడైనా వచ్చింది అంటే.. అందులో నందమూరి ఫ్యాన్స్ ఓటర్లు కీలకంగా ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీగా.. ఆయన అభిమానులు.. వారి వారసులు చాలామంది ఇప్పటికీ  టీడీపీ (TDP)వైపే ఉంటున్నారు. ఇక ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య (Balakrishna) తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో బాలయ్య కు ఎంతో క్రేజ్ ఉంది. ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. దీంతో ఆయన అభిమానులు సైతం టీడీపీనే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫాలోవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి వారసుడిగానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఒక ఓన్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నా.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎన్టీఆర్ ను పెద్దగా పట్టించుకోకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం టీడీపీకే జై కొడతారు ఎందుకంట.. గతంలో ఎన్టీఆర్ ఈ విషయంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణం ఉన్నంతవరకు.. తాతా స్థాపించిన పార్టీ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయన అభిమానులు వేరే పార్టీవైపు చూసే అవకాశం లేదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి సామాజిక సమీకరణాలు చాలా ముఖ్యం కానున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ విజయానికి అండగా నిలిచిన కొన్ని కీలక సామాజిక వర్గాలు.. వైసీపీకి దూరంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆయా సమాజిక వర్గాలు చంద్రబాబు వెంట నడిస్తే.. వైసీపీకి డ్యామేజ్ తప్పదు.. అందుకే ప్రస్తుతం చంద్రబాబుకు  అండగా ఉంటున్న సామాజిక వర్గాన్ని దూరం చెయగలిగితే.. టీడీపీ ఒంటరి అవుతుందన్నది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోంది.

  కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో.. ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి టీడీపీని ఇరకాటంలో పెట్టేసింది వైసీపీ.. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయవాడకు ఎన్టీఆర్ పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక.. కొన్నో రోజుల పాటు టీడీపీ సైలెంట్ అయ్యింది. వైసీపీ నిర్ణయాన్ని సమర్థించలేక.. వ్యతిరేకంగా కమ్మ సామజికవర్గం ఓట్లను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుందని భయంతో.. ఏమీ మాట్లాడ లేకపోయింది.. కానీ ఏదో ఒకటి స్పందించాల్సిన అవసరం రావడంతో.. ఆ నిర్ణయాన్ని స్వాగిస్తూనే వైసీపీ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై వైసీపీకి ప్రేమ ఉంటే ఆయన విగ్రహాలు ఎందుకు కూలగొట్టిస్తారని.. అయన పేరుపై ఉన్న అన్నా క్యాంటీన్లను ఎందుకు తొలగిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది..

  ఇదీ చదవండి : ఆహ్వానం పలుకుతున్న బాహుబలి షూటింగ్ స్పాట్.. సమ్మర్ లో ట్రిప్ కు బెస్ట్ ప్లేస్

  ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి అక్కడతోనే వైసీపీ చేతులు దులుపుకోలేదు. తాజాగా కృష్ణా జిల్లా నిమ్మకూరులోని నందమూరి కుటుంబం జగన్ ను కలిసింది. ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడాన్ని అభినందించారు. ఎన్టీఆర్ బంధువులు , స్నేహితులు, దాయాదుల జగన్ కు ప్రశంసలు అందించారు. నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ఎన్టీఆర్ బంధువులు, మిత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో సందడి చేశారు. దాన్ని కొనసాగించేలా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమ్మ‌కూరులోని 14 ఎక‌రాల చెరువులో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని గ్రామ‌స్థులు కోరారు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు నాటికి నిమ్మ‌కూరులో 100 అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. వ‌చ్చే నెల 28 నాటికి విగ్ర‌హ ఏర్పాటుకు శంకుస్థాప‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

  ఇదీ చదవండి : విశాఖపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ పని త్వరగా చేయాలని కేంద్రానికి లేఖ

  తాజాగా భీమ్లా నాయక్ వివాదాన్ని కూడా తమకు అనుకూలంగా చేసుకునే పనిలో పడింది వైసీపీ.. ఏపీలో టికెట్ల ధరలు పెంచకపోవడం.. అలాగే బినిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం.. దీనికితోడు.. మొన్నటి వరకు ఆంక్షలను పట్టించుకోని వైసీపీ సర్కార్.. భీమ్లా నాయక్ రిలీజ్ ముందు థియేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికార ధరలు వసూలు చేసినా.. అదనపు షో వేసినా.. థియేటర్లను సీజ్ చేస్తామని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై పవన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. పవన్ కు మద్దతుగా టీడీపీ కూడా గళమెత్తుతోంది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం పవన్ కు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ భారీగానే డ్యామేజ్ అయ్యింది.

  ఇదీ చదవండి : సీఎం జగన్ మీద నిందలు వేస్తే అదే జరిగేది..? పోసాని సంచలన వ్యాఖ్యలు

  ఆ డ్యామేజ్ కంట్రోల్ లో భాగమన్నట్టు.. వైసీపీ నందమూరి ఫ్యామిలీని తెరపైకి తెచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ సినిమాకు సపోర్ట్ గా మాట్లాడుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎప్పుడైనా పాజిటివ్ కామెంట్లు చేశారా అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తో బలవంతంగా జెండా మోయించి.. తరువాత వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది అని ఆయన ఆరోపించారు. అంతేకాదు అఖండ సినిమా రిలీజ్ సమయంలో బాలయ్య.. సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరితే.. ఆయనను అగౌరవ పరచకూడదని.. సీఎం చెప్పారని.. బాలయ్యకు కావాల్సిన పని చూడాలంటూ తనను ఆదేశించారని.. బాలయ్యకు అబద్దాలు చెప్పడం రాదని.. ఆయన గొప్ప మనిషి అంటూ పేర్ని నాని పొగడ్తల వర్షం కురిపించారు. అయితే కేవలం రాజకీయ విమర్శల్లాగా ఈ కామెంట్లు కనిపించడం లేదు.. దీని వెనుక నందమూరి అభిమానులను ఓన్ చేసుకోవడమే వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bala Krishna Nandamuri, Jr ntr, Ycp

  ఉత్తమ కథలు